క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

ష‌ర్మిల బృందంపై చెప్పులు విసిరిన టీఆర్ఎస్ శ్రేణులు!

ష‌ర్మిల బృందంపై చెప్పులు విసిరిన టీఆర్ఎస్ శ్రేణులు!
-సూర్యాపేట జిల్లాలో ఘ‌ట‌న‌
-మాట ముచ్చ‌ట‌కు హాజ‌రైన ష‌ర్మిల‌
-ష‌ర్మిల‌కు వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ నినాదాలు
-చివ‌ర‌కు ష‌ర్మిల బృందంపైకి చెప్పుల విసిరివేత‌

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌కు అవ‌మానం జ‌రిగింది. ష‌ర్మిల ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు ఆమె బృందంపై ఏకంగా చెప్పులు విసిరేశాయి. ఈ ఘ‌ట‌న‌తో సూర్యాపేట జిల్లా తుంగ‌తుర్తి ప‌రిధిలోని నాగారంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. గత కొన్ని రోజులుగా ఆమె పాదయాత్ర చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఆమె పర్యటన సాగింది. కానీ ఈ విధంగా ఆమెకు అవమానం జరగలేదు . రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజం అందుకు ప్రతిగా దాడులు చేయడం పై టీఆర్ యస్ శ్రేణులు విమర్శలకు గురిఅవుతున్నారు . షర్మిల పై దాడి చేయడం అవివేకమైన చర్యగా పలువురు పేర్కొంటున్నారు . ఇదే సంస్కృతీ కొనసాగితే అందరికి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

వైఎస్సార్టీపీ రూపొందించిన‌ మాట ముచ్చ‌ట కార్య‌క్ర‌మంలో పాలుపంచుకునే నిమిత్తం ష‌ర్మిల బుధ‌వారం నాగారం వెళ్లారు. ఈ పంద‌ర్భంగా ష‌ర్మిలను చూసిన టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఆమెకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. జై తెలంగాణ‌, జై కేసీఆర్ అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. అంత‌టితో ఆగ‌ని టీఆర్ఎస్ కార్య‌కర్త‌లు ష‌ర్మిల బృందంపై చెప్పులు విసిరేశారు. ఈ హ‌ఠాత్ప‌రిణామానికి ష‌ర్మిల షాక్ తిన్నారు.

Related posts

కేరళ సీఎం విజయన్ సిపిఎం అగ్రనేతలు ఏచూరి ,కారత్ లు సీఎం కేసీఆర్ తో భేటీ !

Drukpadam

లోకేష్ జూమ్ మీటింగ్ కు వైసీపీ బ్రేక్ …

Drukpadam

మెక్సికోలో దారుణం… కాల్ సెంటర్లో ఉద్యోగం మానేస్తున్నారని 8 మంది దారుణ హత్య!

Drukpadam