Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రధాని పదవి నుంచి సోదరుడ్ని తొలగించేందుకు అంగీకరించిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స!

ప్రధాని పదవి నుంచి సోదరుడ్ని తొలగించేందుకు అంగీకరించిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స!
-శ్రీలంకలో తీవ్రస్థాయిలో సంక్షోభం
-కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు
-కొత్త ప్రధాని నియామకం కోసం జాతీయ మండలి
-సానుకూలంగా స్పందించిన అధ్యక్షుడు గొటబాయ

శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. నిన్న మొన్నటిదాకా తమ కుటుంబం అధికారం నుంచి తప్పుకునేది లేదని భీష్మించుకున్న దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స కీలక నిర్ణయం తీసుకున్నారు. విపరీతమైన ఒత్తిళ్ల నేపథ్యంలో తన సోదరుడు మహింద రాజపక్సను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించేందుకు అంగీకరించారు. దేశంలో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన సానుకూలంగా స్పందించారు.

అన్ని రాజకీయ పార్టీల సమ్మతితో కొత్త ప్రధాని, క్యాబినెట్ నియామకం కోసం జాతీయ మండలి రూపుదిద్దుకోనుందని పార్లమెంటు సభ్యుడు మైత్రిపాల సిరిసేన వెల్లడించారు.

శ్రీలంకలో కరోనా అనంతరం తీవ్ర సంక్షోభం నెలకొంది. అప్పుల ఊబిలో దేశం కూరుకుపోగా, ద్రవ్యోల్బణం అమాంతం పెరిగిపోయింది. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతుండగా, విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటాయి. దాంతో విదేశీ వాణిజ్యం జరపలేక, ఇంటి పరిస్థితులు చక్కదిద్దలేక శ్రీలంక ప్రభుత్వం కుదేలైంది. భారత్ వంటి దేశాలు అందిస్తున్న సాయమే ఇప్పుడు శ్రీలంకకు దిక్కు అయింది.

ఈ నేపథ్యంలో, గొటబాయ రాజపక్స కుటుంబ పాలన వల్లే దేశానికి ఈ దుస్థితి దాపురించిందని తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్…

Ram Narayana

రష్యాలో విషాదం… పాఠశాలపై కాల్పులు.. 13 మంది మృతి…

Drukpadam

DriveShare Lets You Rent Your Dream Car From A Car Collector

Drukpadam

Leave a Comment