Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ లో తగ్గేదేలే…అంటున్న వైసీపీ ,టీడీపీలు…

ఏపీ లో తగ్గేదేలే…అంటున్న వైసీపీ ,టీడీపీలు…
ఒకపక్కటీడీపీ మహానాడు …మరోపక్క వైసీపీ సామజిక న్యాయం బస్సు యాత్ర
ఏపీ లో వేడిక్కిన రాజకీయాలు … పరస్పరం విమర్శల జోరు
మహానాడు వేదికగా సీఎం జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టిన టీడీపీ శ్రేణులు
బస్సు యాత్ర లో చంద్రబాబు విధానాలను తూర్పార బడుతున్న వైసీపీ మంత్రులు

ఏపీలో ఇప్పుడే ఎన్నికలు జరగబోతున్నాయా అన్నంత హడావుడి జరుగుతుంది… వైసీపీ టీడీపీ లు ఎవరికీ వారు తగ్గేదేలే అంటున్నారు ….పరస్పరం విమర్శలు …వ్యక్తిగత దూషణలతో రాష్ట్రాన్ని రణరంగంగా మార్చబోతున్నారా ?అన్నంతగా పరిస్థితులు మారాయి…. ఒకపక్క టీడీపీ మహానాడులో జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టగా మరోపక్క తామేమి తక్కువతినలేదని వైసీపీ మంత్రులతో సామజిక న్యాయం పేరుతొ బస్సు యాత్ర నిర్వహిస్తుంది. మహానాడులో చంద్రబాబు ,లోకేష్ లు పాల్గొని రాష్ట్రప్రభుత్వం పై దుమ్మత్తి పోయగా , వైపు మంత్రులు చంద్రబాబు ప్రజలు చేసిన మేలు ఇమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీల పేరుతొ ఓట్లు పొంది మంత్రి పదవులు ఇవ్వకపోవడాన్ని వారు ఎత్తి చూపుతున్నారు .దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అసలే భానుడి ప్రతాపంతో భగభగ మంటుంటే రాజకీయ వేడి రణరంగాన్ని తలపిస్తుంది.

ఒంగోలు కేంద్రంలో జరిగిన టీడీపీ మహానాడు లో క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుపు నివ్వగా …చంద్రబాబు వస్తే సామాజికన్యాయం జరగదని , ప్రజలకు సంక్షేమ ఫలాలు అందవని రాష్ట్రంలో చేపట్టిన సామజిక న్యాయ బస్సు యాత్రలో మంత్రులు అంటున్నారు . చంద్రబాబుకు అధికారం కళ్ల అని , గతంలోనే రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయలేదని 23 సీట్లకు పరిమితం చేశారని గుర్తు చేస్తున్నారు .

మనకు బంగారం దొరికితే మనపిల్లలకు ఇస్తాం…మన ఆస్తులు పెంచుకుంటాం …కానీ అదే జగన్ కు బంగారం దొరికితే అందరికి పంచుతారనే సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాద రావు మాటలు ప్రజలను ఆలోచింప జేస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఎంతమందికి బీసీలకు ఎస్సీలకు , ఎస్టీలకు మంత్రిపదవులు ఇచ్చారో చెప్పాలని మంత్రులు డిమాండ్ చేస్తున్నారు .

ఈ రెండు కార్యక్రమాల్లో మాట్లాడుతున్నవాళ్ళు అధికంగా బీసీ, ఎస్సీ , ఎస్టీలు కావడం విశేషం ,చంద్రబాబు మహానాడుకు భారీగానే కార్యకర్తలు తరలి రాగ , వైసీపీ మంత్రుల యాత్రలకు సైతం జనం తండోపదాలుగా వస్తున్నారు .మొత్తం మీద జగన్ సామజిక నినాదం బీసీలు బడుగు బలహీన వర్గాలు , ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీల వైపు మళ్లింది. చూద్దాం ముందు ముందు ఏమి జరుగుతుందో……

Related posts

తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ …ప్రోత్సహించింది చంద్రబాబు : విలేకర్లతో చిట్ చాట్ లో తుమ్మల …

Drukpadam

ఆదర్శంగా ఉంచాలన్న కుప్పాన్ని ఆగం చేశారు …చంద్రబాబు

Drukpadam

ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఎదురుదెబ్బ…ఎస్పీలో చేరిన మంత్రి,ముగ్గురు ఎమ్మెల్యేలు!

Drukpadam

Leave a Comment