Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇమ్రాన్ ఖాన్ ‘ఆజాదీ మార్చ్’పై పాక్ రక్షణ మంత్రి తీవ్ర ఆరోపణలు..

ఇమ్రాన్ ఖాన్ ‘ఆజాదీ మార్చ్’పై పాక్ రక్షణ మంత్రి తీవ్ర ఆరోపణలు.. ఆయన మద్దతుదారులు ఆటోమెటిక్ రైఫిల్స్‌తో వచ్చారని ఆగ్రహం!
-సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలంటూ ‘ఆజాదీ మార్చ్’ నిర్వహించిన ఇమ్రాన్ ఖాన్
-ర్యాలీలో తమ పార్టీ కార్యకర్తలు ఆయుధాలతో పాల్గొన్నారన్న మాజీ ప్రధాని
-తుపాకులే కాకుండా ఆటోమెటిక్ ఆయుధాలతో వచ్చారన్న మంత్రి
-ఇమ్రానే తీసుకురమ్మన్నారని మంత్రి ఆగ్రహం

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రావిన్షియల్ అసెంబ్లీ ఎన్నికలు రద్దు చేసి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలంటూ ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ‘ఆజాదీ మార్చ్’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై ఆరు రోజుల్లో ప్రకటన చేయాలని, లేదంటే ‘యావత్ దేశం’తో కలిసి తాను మళ్లీ రాజధాని ఇస్లామాబాద్ వస్తానని హెచ్చరించారు.

ఇమ్రాన్ ఇటీవల ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆజాదీ ర్యాలీ’లో తమ పార్టీ కార్యకర్తలు ఆయుధాలు తీసుకొచ్చారని చెప్పారు. ఇమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి అసిఫ్ మాట్లాడుతూ.. ఆ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ చెప్పింది నిజమేనని, ఆయన పార్టీ కార్యకర్తలు తుపాకులే కాకుండా ఆటోమెటిక్ రైఫిల్స్ కూడా ర్యాలీలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఆయుధాలు తీసుకురావాలని ఇమ్రానే నిరసనకారులకు సూచించారని, ప్రభుత్వానికి ఆ విషయం తెలుసని ఖవాజా పేర్కొన్నారు.

Related posts

ఇస్లాంలో ఈ ఐదు విషయాలే ఆవశ్యకం.. అందులో హిజాబ్ లేదు: కేరళ గవర్నర్!

Drukpadam

గణేశ్ నిమజ్జన సమస్యలపై మీకసలు పట్టింపే లేదా?: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మండిపాటు!

Drukpadam

కమ్యూనిస్టు సిద్ధాంతం మాత్రమే ప్రజల అవసరాలను గుర్తిస్తుంది .. కూనంనేని

Ram Narayana

Leave a Comment