Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మహ్మద్ ప్రవక్తపైవ్యాఖ్యల ఫలితం… భారత రాయబారికి సమన్లు పంపిన ఖతార్…

భారత రాయబారికి సమన్లు పంపిన ఖతార్… మహ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధుల వ్యాఖ్యల ఫలితం

  • మహ్మద్ ప్రవక్తపై కామెంట్ల దుమారం
  • నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు
  • తీవ్రంగా స్పందించిన ఖతార్ దేశ ప్రభుత్వం
  • వివరణ ఇచ్చిన భారత రాయబారి

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీతో పాటు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం తమ దేశంలోని భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. దీనిపై భారత రాయబారి దీపక్ మిట్టల్ వివరణ ఇచ్చారు.

ఆ వ్యాఖ్యలతో భారత ప్రభుత్వానికి సంబంధం లేదని, ఆ ట్వీట్లు భారత ప్రభుత్వ మనోభావాలను ప్రతిబింబించేవిగా భావించరాదని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలు బాహ్య శక్తుల పనే అని ఓ సందేశంలో ఉద్ఘాటించారు. నాగరికత వారసత్వం, భిన్నత్వంలో ఏకత్వం, బలమైన సాంస్కృతిక సంప్రదాయాలకు అనుగుణంగా భారత కేంద్ర ప్రభుత్వం అన్ని మతాలకు సర్వోన్నత గౌరవం ఇస్తుందని వివరించారు. ఆ వ్యాఖ్యలు చేసినవారిపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది అని దీపక్ మిట్టల్ పేర్కొన్నారు.

నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ల ప్రాథమిక సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. నుపుర్ శర్మ ఇటీవల మహ్మద్ ప్రవక్తపై ఓ టీవీ చాన్ డిబేట్ లో వ్యాఖ్యలు చేయగా, మహ్మద్ ప్రవక్తపై నవీన్ జిందాల్ కొన్ని ట్వీట్లు చేశారు.

Related posts

Drukpadam

దేశంలో మరో ఎయిర్ లైన్స్ సంస్థ… ‘ఆకాశ ఎయిర్’ కు డీజీసీఏ పచ్చజెండా!

Drukpadam

తెలంగాణ పోలీసు శాఖలో కీలక మార్పు.. -ప్రభుత్వ ఆకస్మిక ఉత్తర్వులు…

Drukpadam

Leave a Comment