175 స్థానాల్లో వైసీపీ గెలిస్తే టీడీపీ కార్యాలయానికి తాళం వేస్తాం: అచ్చెన్నాయుడు!
-కుప్పం తో సహా 175 స్థానాల్లో గెలవాలన్న జగన్
-175 స్థానాల్లో గెలుస్తామని జగన్ కు నమ్మకం ఉందా అన్న అచ్చన్న
-నమ్మకం ఉంటే ఇప్పుడు జగన్ ఎన్నికలకు వెళ్టాలని సవాల్
-మళ్లీ జగన్‌కే ఓట్లేసేంత అమాయకులు కాదు ప్రజలు
-ఏం చేశారని వైసీపీని ప్రజలు గెలిపిస్తారన్న అచ్చెన్న
వైసీపీ రానున్న ఎన్నికల్లో కుప్పంతోసహా 175 సీట్లలో గెలవాలని సీఎం వైయస్ జగన్ ఎమ్మెల్యేలు ,ఎంపీలు , మంత్రులు , ఎమ్మెల్సీలు నాయకులతో జరిగిన వర్క్ షాప్ లో అన్నారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు నిజంగా వైసిపి 175 సీట్లు గెలిస్తే టీడీపీ కార్యాలయానికి తాళం వేస్తామని అన్నారు .175 సీట్లు గెలుస్తామని సీఎం జగన్ కు నమ్మకం ఉంటె వెంటనే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు …
ఏపీలో అధికార వైసీపీకి విపక్ష టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం ఓ సవాల్ విసిరారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగా 175 స్థానాల్లో వైసీపీ గెలిస్తే టీడీపీ కార్యాలయానికి తాళాలు వేస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. మరి వైసీపీ 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని జగన్‌కు నమ్మకం ఉందా? అని అచ్చెన్న ప్రశ్నించారు. అదే నమ్మకం ఉన్నట్లైతే జగన్ ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని ఆయన సవాల్ విసిరారు. తక్షణమే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
అయినా ఏం చేశారని రాష్ట్ర ప్రజలు వైసీపీని 175 స్థానాల్లో గెలిపిస్తారని అచ్చెన్న ప్రశ్నించారు. మరోమారు జగన్‌కు ఓట్లేసేంత అమాయకులు ప్రజలు కాదని ఆయన వ్యాఖ్యానించారు. టెన్త్ రిజల్ట్స్ నేపథ్యంలో ప్రభుత్వ తప్పుల కారణంగా మనోవేదనకు గురవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో భరోసా నింపేందుకు నారా లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తే వైసీపీ నేతలు అందులోకి దొంగల్లా ప్రవేశించారని అచ్చెన్న మండిపడ్డారు. పిల్లలను భయపెట్టి జూమ్ కాన్ఫరెన్స్‌లోకి చొరబడ్డ వైసీపీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.