Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఔరా ఖమ్మం …శబాష్ అజయ్…!

ఔరా ఖమ్మం …శబాష్ అజయ్…!
-అభివృద్ధిలో మేటి …రాష్ట్రానికే ఆదర్శంగా ఖమ్మం నగర ప్రగతి…
-మంత్రి కేటీఆర్ పర్యటనకు ఖమ్మం నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబు …
-ఖమ్మం నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్న మంత్రి పువ్వాడ
-ఖమ్మం ను అందంగా తీర్చిదిద్దుతున్న ఘనత పువ్వాడదే
-అభివృద్ధిలో రాజీలేదంటున్న పువ్వాడ

ఖమ్మం నగర అభివృద్ధిని చూసి.. ఔరా ఖమ్మం …శబాష్ మంత్రి అజయ్ అని అనుకుండా ఉండలేకపోతున్నారు ఖమ్మం ప్రజలు …ఒకప్పటి ఖమ్మంకు ఇప్పటికి ఖమ్మానికి పోలికే లేదు … విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలు వచ్చి ఖమ్మం అభివృద్ధిని చూసి ముగ్దులౌతున్నారు …మంత్రి అజయ్ కృషితో ఖమ్మం నగర రూపురేఖలు మారాయి… ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది.
ఖమ్మం నగరం అభివృద్ధిలో పరుగులు పెట్టడానికి ఆయనే కారకుడు … రాష్ట్రంలో మారె నగరం ఇంత తక్కువ సమయంలో అభివృద్ధి జరగలేదంటే అతిశయోక్తి కాదు …ఇంత తక్కువ సమయంలో అభివృద్ధి చేయడం ఎలా సాధ్యమైందని పలువురు ఆశ్చర్య పోతున్నారు . ఇక్కడ కు వచ్చిన మంత్రులు అధికారులు సైతం ఖమ్మం అభివృద్ధి గురించి చెప్పుకోవడం విశేషం … దీన్ని రోల్ మోడల్ గా తీసుకోవాలని కూడా అంటుండడం గర్వకారణం …

ఖమ్మం నగరం పై ఫోకస్ పెట్టిన మంత్రి అజయ్ నగరాన్ని ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు… దీంతో ఖమ్మం రూపు రేఖలు మారాయి . ఇప్పుడు రాష్ట్రంలోనే అభివృద్ధికి కేరాఫ్ గా ఖమ్మం నగరం నిలిచింది…అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. అందమైన ఖమ్మం గా అనతికాలంలోనే గణతికెక్కింది. ఇక్కడ అక్కడ అనే లేకుండా అన్ని ప్రాంతాలు అందంగా కళకళలాడుతున్నాయి.

 

రోడ్ల వెడల్పు …డివైడర్ల ఏర్పాటు … సెంట్రల్ లైటింగ్ … ఫుట్ పాత్ లు … పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు నాటడం … ప్రకృతి వనాలు…. అంతకుముందే కొత్తగా నిర్మించిన లకారం లేక్ ఆధునికీకరణ … అందులో ఏర్పాటు చేసిన జాతీయ జెండా … వేలాడే వంతెన … వాకింగ్ పారడైజె …. కొత్త బస్సు స్టాండ్ … ఐ టి హబ్ … ముస్తఫా నగర్ ఆధునికీకరణ , ఇల్లందు రోడ్ నుంచి రఘనాథపాలెం వరకు ఏర్పాటు చేసిన రోడ్,నగర ప్రజలకు అత్యాధునిక హంగులతో నిర్మించిన మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనాలు …వైకుంఠధామాలు (శ్శశాన వాటికలు) మంచినీటి కొరత లేకుండా తీసుకున్న చర్యలు …కొత్తగా ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్స్ …డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం లో సైతం ఖమ్మం లో మల్టీ స్టైర్ బిల్డింగ్ లు కొత్త ఖమ్మంన్ని ఆవిష్కరిస్తున్నాయి. నగరంలో అందమైన పార్క్ లు వాటిలో వాకింగ్ ట్రాక్ లు …జిమ్ లు ప్రజలకు ఆహ్లదాన్ని ఇస్తున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న పాత కార్పొరేషన్ కార్యాలయాన్ని సెంట్రల్ గ్రంధాలయంగా మార్చడం గొప్ప నిర్యమనే చెప్పాలి …దీన్ని రీజనల్ లైబ్రరీ గా మార్చగలిగితే సెంట్రల్ ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది.    నగరంలో కొత్తదనాన్ని సంతరింప జేశాయి. అభివృద్ధి ఇలా ఉండాలనేలా నగరాన్ని మార్చివేశాయి .

 

 

ఒకప్పుడు ఉద్యమాల గుమ్మం ఖమ్మం ….ఇప్పుడు అభివృద్ధి గుమ్మంగా మార్చిన ఘనత మంత్రి అజయ్ కే దక్కుతుంది. ఇప్పుడు జరిగిన అభివృద్ధినే కాకుండా మరింత అభివృద్ధి చేయాలనే తన అభిలాషను మంత్రి తరచూ వ్యక్తం చేస్తుంటారు … ఖమ్మం మునేరు ఇరుపక్కలా బ్యాండ్ ఏర్పాటు …ఖమ్మానికి కొత్త బైపాస్ రోడ్ … ఇప్పుడున్న బైపాస్ రోడ్ లో రెండు మూడు చోట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి లు ,మునేరు పై ,బైపాస్ రైల్ బ్రిడ్జి పక్కన మరో బ్రిడ్జి ఏర్పాటు లాంటి చర్యలు అవసరం ఉంది. ఇవి కూడా మంత్రి మదిలో ఉన్న అంశాలే … ఖమ్మం ముందుముందు మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాం ….

Related posts

జానారెడ్డిని మరింత ముంచడానికే కాంగ్రెస్ నేతలు వచ్చారు: తలసాని

Drukpadam

విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన 1400 ఎకరాల భూముల విక్రయ ప్రక్రియ ప్రారంభం

Ram Narayana

చక్కని కంటి చూపునకు కొన్ని చిట్కాలు!

Drukpadam

Leave a Comment