Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రతిరోజూ బీర్ తాగితే బోలెడు లాభాలట..

ప్రతిరోజూ బీర్ తాగితే బోలెడు లాభాలట.. కానీ తెలుసుకోవాల్సిన విషయాలివే!
మద్యం ఆరోగ్యానికి హానికరం అది మోతాదు మించితే ..
ఇది మందు బాబులకు మంచి కబురే
ప్రతిరోజు బీర్ లిమిట్ లో తాగటం వల్ల ఆరోగ్యానికి మేలు
పోర్చుగీస్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడి

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం ఇది ప్రతి మందు బాటిల్ మీద ప్రింటెడ్ గా ఉంటుంది. ఈ హెచ్చరిక లేకపోతె తయారు చేసే కంపెనీ కి లైసెన్స్ ఇవ్వరు . అయినప్పటికీ మందుబాబులు వాటిని లెక్కచేయకుండా మందు తాగుతూనే ఉంటారు . ఎక్కువగా మద్యం సేవించే వారి ఆరోగ్యం పాడవుతుందని కూడా చెప్తుంటారు. మందు వల్ల ఉపయోగం ఉందనేది అధ్యనాలు వెల్లడిస్తున్నాయి. అది ఒక లిమిట్ లో ప్రతి రోజు బీరు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఓ అధ్యయనం ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకు రావడంతో ఇంకేం మందుబాబులకు పండుగ చేసుకున్నట్టుగా ఉంది. అయితే వాళ్లంతా ముందు దీనికి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది

ప్రతిరోజు బీర్ లిమిట్ లో తాగటం వల్ల ఆరోగ్యానికి మేలు
ప్రతి రోజు బీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని ఆసక్తికరమైన విషయాలను పోర్చుగీసు యూనివర్సిటీ ఓ అధ్యయనం వెల్లడించింది. ప్రతిరోజూ బీరు తాగడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని పోర్చుగల్‌లోని నోవా యూనివర్శిటీ, లిస్బన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో తేల్చారు. రోజూ రాత్రి భోజనంతో పాటు బీర్ తాగడం వల్ల పురుషుల పొట్టలో మంచి బ్యాక్టీరియా స్థాయి పెరుగుతుందని వారు చెబుతున్నారు. ఈ ప్రయోజనం ఆల్కహాలిక్ మరియు నాన్-ఆల్కహాలిక్ బీర్ రెండింటి నుండి వస్తుందని వారు పేర్కొన్నారు

19మంది 35ఏళ్ళ పురుషులపై 4 వారాల పాటు సాగిన పరిశోధన

మొత్తం 19 మంది 35 సంవత్సరాల వయసున్న పురుషులపై ఈ అధ్యయనాన్ని కొనసాగించారు. వారందరూ 4 వారాల పాటు ప్రతిరోజూ రాత్రి భోజనంతో పాటు 325 మిల్లీలీటర్ల బీర్ తాగాలని కోరారు. పరిశోధనలో పాల్గొన్న వారిలో కొందరికి ఆల్కహాల్ మరియు మరికొందరికి ఆల్కహాల్ లేని బీర్ ఇవ్వబడింది. ఆల్కహాలిక్ బీర్ లో ఆల్కహాల్ కంటెంట్ 5.2%గా ఉంది. ఇటువంటి బీర్ కొందరికి ఇవ్వబడింది. మరి కొందరికి నాన్ ఆల్కహాలిక్ బీర్ ఇవ్వబడింది

బీర్ తాగడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా

4 వారాల పాటు చేసిన అధ్యయనం తరువాత, ఈ పురుషుల మలం మరియు రక్త నమూనాలను తీసుకున్నారు. ఈ నమూనాల ఆధారంగా బీర్ తాగడం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించబడిన ఈ పరిశోధన ఫలితాలు బీర్ తాగడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఈ బ్యాక్టీరియా మరింత వైవిధ్యమైనది. ఇది మొత్తం జీర్ణవ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వెల్లడించారు

ఎంత పడితే అంత తాగితే అనారోగ్యం పక్కా .. మందుబాబులు తస్మాత్ జాగ్రత్త
ఇక బీర్ తాగటం మంచిదే అని శాస్త్రవేత్తలు చెప్పారని ఎంత పడితే అంత తాగేస్తే కచ్చితంగా అనారోగ్యం పాలవుతారు. లిమిట్ లో మోతాదు మించకుండా బీర్ ను కూడా ఒక టానిక్ లా పద్దతిగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది తప్ప,. ఇష్టారాజ్యంగా కడుపు నిండా పోస్తే అది మరింత ప్రమాదకారిగా మారుతుంది. అందుకే మందుబాబులు తస్మాత్ జాగ్రత్త …

Related posts

ఎట్టకేలకు పాకిస్థాన్ చేరిన ‘బోర్డర్’ బాబు!

Drukpadam

భద్రత పెంచాలంటూ రేవంత్ రెడ్డి పిటిషన్.. విచారణ చేపట్టిన హైకోర్టు

Drukpadam

హత్య చేసిన వారెవరైనా వదిలిపెట్టం:మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్!

Drukpadam

Leave a Comment