Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సిపిఐ నారాయణ లాజిక్ మిస్ అయ్యారా ?

పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ నియామకం చెల్లదుగాక.. చెల్లదు : సీపీఐ నారాయణ!
-శాశ్వత అధ్యక్షుడిగా జగన్ నియామకం చట్టవిరుద్ధం
-ఓటింగ్ ప్రక్రియ ద్వారానే అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్న నారాయణ
-రెండు, మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని వ్యాఖ్య
-ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక తీర్మానం చెల్లదన్న

 

సీపీఐ నేత సిపిఐ నారాయణ లాజిక్ మిస్ అయ్యారా ?అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . ఒక పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కొన్ని నియమ నిబంధనలు ఉన్నమాట నిజం. అయితే చట్ట ప్రకారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ జరిగింది. అందులో అధ్యక్షుడి ఎన్నిక కోసం ఎన్నికల కమిటీని అధికారిని నియమించారు. పద్ధతి ప్రకారమే నామినేషన్ల ఆహ్వానించారు. అందులో జగన్ ఒక్కడి పేరు అధ్యక్ష పదవికి నామినేషన్ వచ్చింది. అలాంటప్పుడు ఎన్నిక, ఓటింగ్, అనేదానికి అర్థం లేదని అభిప్రాయాలు ఉన్నాయి. లక్షలాది మంది పాల్గొన్న ప్లీనరీ సమావేశంలో అధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్ల ఆహ్వానించి 24 గంటలకు పైగా గడువిచ్చి రెండవ రోజు ఒక్క నామినేషన్ రావడంతో అధ్యక్షుడు ప్రకటించిన అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం అయిందని ప్రకటించారు . ప్రకటించిన విధానం ప్రజాస్వామ్యం బద్దం , చట్టబద్ధం అవునో కాదో చూడాల్సిందే . పార్టీలకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వారి నియమ నిబంధనలు తప్పకుండా ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. దాని ప్రకారమే ఆపార్టీ నడుచుకోవాల్సి ఉంటుంది. దానికి విరుద్ధంగా నడుచుకుంటే అభ్యంతరం వ్యక్తం చేస్తే దానిపై ఎన్నికల సంఘం కోర్ట్ కేసులు ఉంటాయి. అది కూడా పార్టీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఫిర్యాదు చేసినప్పుడు దానికి విలువ ఉంటుంది తప్ప బయట వారు ఫిర్యాదు చేసేస్తే ఉండదు . కావాలని ఎదుటి పార్టీపై మీ ఎన్నిక ఈ విధంగా ఉండాలని చెప్పడం హాస్యాస్పదం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . అందువల్ల నారాయణ చెప్పినట్లు చట్టప్రకారం కాని యెడల తప్పకుండా జగన్ శాశ్వత అధ్యక్షుడిగా ఉండటానికి వీలు పడదు. అదే సందర్భంలో తమిళనాడు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి శాశ్వత అధ్యక్షుడిగా నియమించబడ్డ సందర్భంలో ఎన్నికల సంఘం ఆయన శాశ్వత అధ్యక్ష పదవిని స్వీకరించడంపై వచ్చిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. మరి అలాంటప్పుడు చట్టప్రకారం ఎన్నిక జరగలేదని నారాయణ ఎలా చెప్పగలరు అనేదానిపై ఆసక్తి నెలకొన్నది

 

వైసీపీకి జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సీపీఐ నారాయణ మట్లాడుతూ, ఇది చట్ట విరుద్ధమని అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం ఈ తీర్మానం చెల్లదని చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గత ప్రజాస్వామ్యం చాలా అవసరమని తెలిపారు. ఓటింగ్ ప్రక్రియ ద్వారా మాత్రమే అధ్యక్షుడిని కానీ, కార్యవర్గాన్ని కానీ ఎన్నుకోవాలని అన్నారు. ఇదే విషయాన్ని నిబంధనలు కూడా చెపుతున్నాయని తెలిపారు. రెండు, మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.

జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నిబంధనలను మార్చినప్పుడు ఈసీ నోటీసులిచ్చిందని నారాయణ తెలిపారు. అయితే గతంలో కరుణానిధిని పార్టీ లైఫ్ టైమ్ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ డీఎంకే తీర్మానం చేయడాన్ని ఈసీ ఆమోదించడం గమనార్హం.

నారాయణ అభ్యంతరాలపై విమర్శలు ఉన్నాయి. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం అయితే అన్ని చట్టానికి నిబంధనలకు లోబడే జరిగాయి. లక్షలాదిగా హాజరైన ప్లినరీలో జగన్ ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు . అదికూడా నామినేషన్ స్వీకరించి ఒక్క నామినేషన్ వచ్చినందున పేరు ప్రకటించడం చట్టబద్ధమే అదికూడా ఎన్నికల ప్రక్రియలో భాగమే అనే విషయం సీనియర్ రాజకీయనాయకుడైన సిపిఐ నారాయణకు తెలిసి ఉండాలి … మరో నామినేషన్ రానప్పుడు ఓటింగ్ ప్రక్రియకు అవకాశం ఎక్కడ ఉంటుందనే లాజిక్ నారాయణ ఎక్కడ మిస్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .

Related posts

పార్టీ ప్రెసిడెంటా గా ? లేదా లోకసభాపక్షనేతగా?? రాహుల్ గాంధీ

Drukpadam

తుమ్మల పై మరల ట్రోలింగ్…!

Drukpadam

మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు విద్యార్థుల య‌త్నం.. ఉద్రిక్త‌త‌…

Drukpadam

Leave a Comment