Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉద్దవ్ కు కొత్త తలనొప్పి …ముర్ము కు మద్దతుపై కాంగ్రెస్ గరం గరం ….

ఉద్దవ్ కు కొత్త తలనొప్పి …ముర్ము కు మద్దతుపై కాంగ్రెస్ గరం గరం ….
-కూటమి నుంచి బయటకు వచ్చేస్తామంటు కాంగ్రెస్ హెచ్చరిక
-శివసేన కూటమి ధర్మాన్ని అతిక్రమించిందని కాంగ్రెస్ గుర్రు
-కూటమి నేతలను సంప్రదించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్న
-శివసేన నిర్ణయాన్ని స్వాగతించిన ఎన్‌సీపీ

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. కూటమి ధర్మాన్ని అతిక్రమిస్తే అందులోంచి బయటకు వచ్చేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తుండడంతో మహావికాస్ అఘాడీ కూటమిలో చీలిక తప్పేలా కనిపించడం లేదు.

కూటమిలోని భాగస్వామ్య పక్షాలను సంప్రదించకుండా రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో నిర్ణయం ఎలా తీసుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత బాలాసాహెబ్ థోరట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది స్త్రీ పురుషులు, ట్రైబల్-నాన్ ట్రైబల్ మధ్య జరుగుతున్న పోరు కాదని ఆయన పేర్కొన్నారు. అసలు ముర్ముకు శివసేన ఎందుకు మద్దతు ప్రకటించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆ పార్టీకే చెందిన మరో నేత మిలింద్ దేవ్‌రా కూడా శివసేన తీరుపై మండిపడ్డారు. శివసేన తీరు ఇతర పార్టీలకు ప్రయోజనం చేకూరేలా ఉందన్న అయన.. కూటమి ధర్మాన్ని అతిక్రమిస్తే ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. ఉద్ధవ్ తీరును కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటే.. ఎన్‌సీపీ మాత్రం మద్దతు ప్రకటించడం గమనార్హం. ద్రౌపదికి మద్దతు ఇవ్వడమంటే ఎన్‌డీఏకు మద్దతు ఇచ్చినట్టు కాదని ఆ పార్టీ మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ పేర్కొన్నారు.

Related posts

జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమన్న చంద్రబాబు…

Drukpadam

తమ్ముళ్లు కేసులకు భయపడవద్దు… పార్టీ శ్రేణులతో చంద్రబాబు!

Drukpadam

ముగిసిన రాహుల్ గాంధీ తెలంగాణ టూర్‌…కాసేప‌ట్లో శంషాబాద్ నుంచి ఢిల్లీకి ప‌య‌నం!

Drukpadam

Leave a Comment