జీఎస్టీ రేట్ల పెంపుపై పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన!
- ప్లకార్డులు పట్టుకొని విపక్షాలతో కలిసి నిరసన తెలుపుతున్న ఎంపీలు
- కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- జిల్లాల్లో నిరసన చేపట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
జీఎస్టీ కి వ్యతిరేకంగా పార్లమెంట్ రెండో రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.ఉప్పు నిప్పులాగా ఉండే టీఆర్ యస్ ,కాంగ్రెస్ లు కలసి ఈ అందోళనలో పాల్గొనటం విశేషం. ప్రతిపక్ష పార్టీలు అన్ని జీఎస్టీ విధించడాన్ని తప్పు పడుతున్నాయి . కాంగ్రెస్ పార్టీ తో సహా అనేక పార్టీలో పార్లమంట్ ఆవరణలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీలు ఇందులో పాల్గొన్న ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే అధిర్ రంజాన్ చౌదరి , ఆర్ యస్ లోకసభ పక్ష నేత నామtనాగేశ్వరరావు ఇతర టీఆర్ యస్ ఎంపీలు పాల్గొన్నారు. ఖమ్మం చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బండి పార్థసారథి రెడ్డి కూడా ఈ ఆందోళనలో పాలుపంచుకున్నారు.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల పెంపుపై పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు నేతృత్వంలో విపక్ష పార్టీలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర బీజేపీ ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. గ్యాస్ ధరల పెంపుపై ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
పాలు, పాల ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీఎస్టీ పన్ను విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు, పాల ఉత్పత్తుల పైన పన్ను విధించడం వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ.. అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆందోళన కార్యక్రమాల్లో రైతులను ముఖ్యంగా పాడి రైతులను భాగస్వాములుగా చేయాలని కేటీఆర్ కోరారు.