Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కు స్పందన…వరద భాదితులకు అండగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర!

కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కు స్పందన…వరద భాదితులకు అండగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర!
-50 ట్రాక్టర్ల పశుగ్రాసం …5 లక్షల విలువైన దుప్పట్లు వంటసామగ్రి పంపిణి
-కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తాతా మధు మాజీ ఎమ్మెల్సీ బాలసాని
-రిసీవ్ చేసుకున్న జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు

కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతొ పేదలకు సహాయం చేయాలనీ ఇచ్చిన పిలుపుకు స్పందినచిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య భద్రాచలం వరద భాదితులకు సాయం అందించారు . గోదావరి వరదల కారణంగా పసుగ్రాసం కొరతతో ఇబ్బందిపడుతున్న భద్రాచలంలోని మూడు గోశాలలకు 50 ట్రాక్టర్ల ట్రక్కుల పశుగ్రాసాన్ని వితరణ చేశారు . మొత్తం 50 ఒక్కసారిగా భద్రాచలం వెళ్లడం దారి వెంట గ్రామాల ప్రజలు చర్చించుకున్నారు . అంటే కాకుండా 5 లక్షల రూపాయల విలువైన దుప్పట్లు , ఇతర వస్త్రాలు , వంట సామాగ్రిని ఒక కిట్ గా చేసి స్వయంగా వెంకట వీరయ్య భాదిట్లులకు అందించారు . కేటీఆర్పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా గోదావరి వరద బాధిత మూడు ఆదివాసి గ్రామాలలోని 400 ఆదివాసి కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయలతో దుప్పటి, చీర, షర్టు, లుంగీ, కండువా, పళ్ళెము, గ్లాసు వంట చేయుటకు పాత్రలతో కూడిన కిట్ల పంపిణీ చేసినట్లు వెంకట వీరయ్య తెలిపారు . కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా టీఆర్ యస్ అధ్యక్షులు తాతా మధు , మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ , భద్రాచలం నియోజకవర్గ టీఆర్ యస్ ఇంచార్జి తెల్లం వెంకటరావు , తదితరులు పాల్గొన్నారు .

 

 

భారతీయ సంస్కృతిలో గోమాతను దేవతగా భావిgస్తారని అటువంటి గోమాతకు గోదావరి వరదల కారణంగా పశుగ్రాసం కొరతతో ఇబ్బంది పడుతున్నాయని తెలపగా సత్తుపల్లి నియోజకవర్గంలోని మండలాల నుండి 50 ట్రాక్టర్లు ట్రక్కుల పశుగ్రాసాన్ని భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం గోశాలకు, గాయత్రీ గోక్షేత్రం గోశాలకు, అంబసత్రం గోశాలకు వితరణ చేయడం జరిగిందని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం నుండి 50 ట్రాక్టర్ ట్రక్కుల పశుగ్రాసంతో బయలుదేరి భద్రాచలం గోశాలకు వితరణ చేయడానికి తీసుకురాగా ఈ కార్యక్రమాన్ని భద్రాచలం వద్ద కలెక్టర్ అనుదీప్ , ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తో కలిసి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య జండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పశుగ్రాసాన్ని వితరణ చేశారు.

 

5 లక్షల రూపాయల విలువగల దుప్పటి, చీర, షర్టు, లుంగీ, కండువా, పళ్ళెము, గ్లాసు వంట చేయుటకు పాత్రలతో కూడిన కిట్లను తయారుచేసి పంపిణీకి ఏర్పాటు చేయగా ఈరోజు దుమ్మగూడెం మండలంలోని గోదావరి వరద బాధిత ఆదివాసీ గ్రామాల్లో 400 ఆదివాసి కుటుంబాలకు ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , భద్రాచలం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ తెల్లం వెంకటరావు పంపిణీ చేశారు.

Related posts

Why Consumer Reports Is Wrong About Microsoft’s Surface Products

Drukpadam

జగన్ కు ఏమైంది …విజయవాడ ఆసుపత్రిలో నాలుగు గంటలు …

Ram Narayana

ఖమ్మం లోకసభ సాధారణ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు …ఆర్ ఓ విపి గౌతమ్

Ram Narayana

Leave a Comment