Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చంద్రబాబు భద్రతపై ప్రత్యేక దృష్టి…

చంద్రబాబు భద్రతపై ప్రత్యేక దృష్టి.. నివాసం, టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించిన ఎన్ఎస్జీ డీఐజీ సమర్ దీప్ సింగ్
చంద్రబాబు భద్రతపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ఎన్ఎస్జీ
ఢిల్లీ నుంచి ఎన్ఎస్జీ డీఐజీ నేతృత్వంలో బృందం రాక
రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులను కూడా కలిసిన వైనం

 

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ప్రధాన పక్షాలైన వైసీపీ , టీడీపీ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఎటు దారితీసుతుందోనన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. అధికార వైసీపీ ,ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరుకున్నది . ప్రధానంగా ప్రతిపక్ష నేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భద్రతపై సెంట్రల్ ఇంటలిజెన్స్ ,నేషనల్ సెక్యూర్టీ టీమ్ లు ప్రత్యేక ద్రుష్టి సారించాయి. కేంద్రం నుంచి ఒక ప్రత్యేకటీమ్ అమరావతికి వచ్చి చంద్రబాబు భద్రతపై అధికారులతో చర్చలు జరిపింది.

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిశితంగా పరిశీలించారు. చంద్రబాబు ఛాంబర్ ఎక్కడుంది? సందర్శకులను ఆయన ఎక్కడ కలుస్తున్నారు? చంద్రబాబును కలిసేందుకు వచ్చే వారిని పోలీసులు ఎలా తనిఖీ చేస్తున్నారు? తనిఖీలకు ఏయే పరికరాలను ఉపయోగిస్తున్నారు? స్థానిక పోలీసులు చంద్రబాబుకు ఎలాంటి భద్రతను కల్పిస్తున్నారు? తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులను కూడా సమర్ దీప్ సింగ్ కలిసినట్టు తెలుస్తోంది. కుప్పంలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి నేపథ్యంలో, ఆయన భద్రతపై ఎన్ఎస్జీ ప్రత్యేక దృష్టిని సారించింది.

Related posts

బీజేపీలో చేరుతున్న హార్ధిక్ పటేల్.. ముహూర్తం ఖరారు!

Drukpadam

కర్ణాటక సీఎం యడ్యూరప్ప కు సన్ స్ట్రోక్ తప్పదా ?

Drukpadam

బద్వేల్ బరిలో నిలిచేందుకు బీజేపీ ,కాంగ్రెస్ సిద్ధం…

Drukpadam

Leave a Comment