Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అధికధరల పై కామ్రేడ్ల కన్నెర్ర …ప్రజాపంథా ఆధ్వరంలో ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి …!

అధికధరల పై కామ్రేడ్ల కన్నెర్ర …ప్రజాపంథా ఆధ్వరంలో ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి …!
ఖమ్మం కలెక్టరేట్ కు భారీ ర్యాలీ
జిఎస్టి ఎత్తువేయాలని …అధికధరలు తగ్గించాలని డిమాండ్

పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట కలెక్టరేట్ దూసుకెళ్లిన నాయకులు
ఆహార ఉత్పత్తులపై జిఎస్టిని ఎత్తివేయాలని పెరుగుతున్న గ్యాస్ పెట్రోలు డీజిల్ విద్యుత్ ఛార్జలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్ ) ప్రజా పంధా ఆధ్వర్యంలో సోమవారం నాడు ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి , కలెక్టరేట్ ను ముట్టడి కార్యక్రమన్ని నిర్వహించడం జరిగింది. ర్యాలీ తొలిత ఎన్ఎస్పి క్యాంపు లో గాల రామనరసయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ప్రారంభమై సరితా క్లినిక్ సెంటర్ సంజీవరెడ్డి భవన్ వైరా రోడ్డు మీదగా కలెక్టరేట్కు చేరుకుంది .కలెక్టరేట్ ముందు పోలీసులు నియంత్రించినప్పటికీ ప్రజా పంధా నాయకులు పోలీసుల మధ్య తీవ్రమైన తోపులాటతో కలెక్టరేట్లోకి వందలాది మంది కార్యకర్తలు దూసుకెళ్లారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి జీఎస్టీని ఎత్తివేయాలని ధరలు నియంత్రించాలని నినదించారు.

గబ్బర్ సింగ్ టాక్స్ ఎత్తివేయాలి ….ప్రజా పంధా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు

గబ్బర్ సింగ్ టాక్స్ ఎత్తివేస్తామని ప్రజా పంధా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
మోడీ అధికారంలోకి వచ్చిన 100 రోజులకే ధరల తగ్గిస్తారని హామీ ఇచ్చి ఎనిమిది ఏళ్లలో అత్యధిక ధరలు పెంచారని సిపిఎంఎల్ ప్రజా పంధా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. జీఎస్టీ కాస్త గబ్బర్ సింగ్ ట్యాక్స్ లా మారి సామాన్య పేద మధ్యతరగతి ప్రజలను హింసిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీగా వాడే ఆహార ఉత్పత్తులపై జిఎస్టి టాక్స్ వేయటం దుర్మార్గం. గుర్రపు పందాలు జూదము లాంటి వాటిపై జిఎస్టి మినహాయించి పాలు పెన్సిళ్లు పంచదార లాంటి నిత్యవసర వస్తువులపై జిఎస్టి వేయటం ఏమిటని ఆయన అన్నారు ప్రజలపై బారాలు మోపి పోగుపడ్డ కోట్ల రూపాయలును కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్నారని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు కనీస వేతనలు ఇవ్వకుండా, ఉపాధి హామీ లేకుండా, ఉద్యోగాలు లేవకుండా ధరలభారంతో ఎలా జీవించాలని ప్రశ్నించారు. ప్రజా పంధా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలకి పూనుకున్నామని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్న అన్ని రకాల భారాలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ప్రతినిధి బృందం కలెక్టర్ ని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజా పంధా జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, శివలింగం మలీదు నాగేశ్వరరావు ,, సివై పుల్లయ్య, కే అర్జున్ రావు, రామయ్య, బందెల వెంకయ్య, వెంకన్న, ఆవుల అశోక్ ,లాల్మీయ, లలిత, శిరోమణి ,ఝాన్సీ, శ్రీను, కమకోటి నాగేశ్వరరావు, గంటా శ్రీను, శరత్ ,ఆజాద్ ,వెంకటేష్, భరత్, రాకేష్, సురేష్, కుర్ర ఎంకన్న మారుతి మల్లయ్య కే లోతు లక్ష్మణ్ గుమ్మడి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా కె .రామకృష్ణ ఏకగ్రీవ ఎన్నిక!

Drukpadam

తుమ్మల సై అంటున్నారా …? సైలెంట్ అయ్యారా …??

Drukpadam

ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు!

Drukpadam

Leave a Comment