Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కృష్ణయ్య హత్య పై సిబిఐ విచారణ జరిపించాలి …బీజేపీ డిమాండ్!

కృష్ణయ్య హత్య పై సిబిఐ విచారణ జరిపించాలి …బీజేపీ డిమాండ్!
కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 10 న తెల్దారుపల్లి కి బండి సంజయ్
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ

రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమ్మినేని కృష్ణయ్య హత్యపై సిబిఐ దర్యాప్తు జరపాలని బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లాలో హత్య రాజకీయాలకు పాల్పడటం చాలా దుర్మార్గమైన చర్యగా భారతీయ జనతా పార్టీ భావిస్తుందని అన్నారు .

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం కోసమే టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పడం అబద్ధపు ప్రచారమని కేవలం తెల్దారిపల్లి గ్రామంలో తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు నుండి సిపిఎం నాయకులను కాపాడటం కోసమే టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు ఉన్నదని ఆరోపించారు

తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి బి ఎల్ వర్మ పరామర్శించి, కేంద్ర హోం శాఖ దృష్టికి మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఇందులో ఎటువంటి రాజకీయ కోణము లేదని కేవలం మానవతా విలువల కోసమే హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఇదంతా చేయడం జరిగిందని అన్నారు

టీఆర్ యస్ పార్టీ జిల్లా నాయకులైనటువంటి తమ్మినేని కృష్ణయ్యను సిపిఎం పార్టీ వారు హత్య చేస్తే టీఆర్ యస్ నాయకులు తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులకు అండగా నిలబడవలసింది పోయి మునుగోడు ఎన్నికలలో టీఆర్ యస్ సిపిఎం పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీని ఓడిస్తామని చెప్పటం దేనికి సంకేతం అని ప్రశ్నించారు

సిపిఎం పార్టీ కీ తమ్మినేని కృష్ణయ్య హత్యతో సంబంధం లేనట్లయితే హత్య ఆరోపణలు ఎదుర్కొన్న సిపిఎం నాయకులని పార్టీ నుండి ఎందుకు బహిష్కరించడం లేదో సిపిఎం
రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమాధానం చెప్పాలని అన్నారు

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఈనెల 10వ తేదీన తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులను తెల్దార్ పల్లి గ్రామంలో వారి ఇంటి వద్ద కలిసి పరామర్శిస్తారని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూపాలపల్లి జిల్లా ఇన్చార్జ్ సన్నె ఉదయ ప్రతాప్ మాట్లాడుతూ, గతంలో కమ్యూనిస్టులు పేద ప్రజల పక్షాన పోరాటం చేసే వారిని, ఈ నయా కమ్యూనిస్టు నాయకులు హత్య రాజకీయాలను ప్రోత్సహించటం దారుణమని అన్నారు

మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు గంటేల విద్యాసాగర్, పెరుమాళ్ళపల్లి విజయరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్యామ్ రాథోడ్, నున్న రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మంద సరస్వతి, గుత్త వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు అల్లిక అంజయ్య నెల్లూరు కోటేశ్వరరావు, యువ మోర్చా నాయకులు దుద్దుకూరి కార్తీక్, డీకొండ శ్యామ్, మారగంటి రంగబాబు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

దీదీని అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ

Drukpadam

ఏక్‌నాథ్ షిండేనే మ‌హారాష్ట్ర సీఎం!.. దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

Drukpadam

ప్రశాంత్ కిశోర్ చేరికపై కాంగ్రెస్ లో ఎవరికీ అభ్యంతరం లేదు: దిగ్విజయ్ సింగ్

Drukpadam

Leave a Comment