Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ అసెంబ్లీ లో వివిధ శాఖల చట్ట సవరణ బిల్లులు ప్రవేశ పెట్టిన మంత్రులు …

తెలంగాణ అసెంబ్లీ లో వివిధ శాఖల చట్ట సవరణ బిల్లులు ప్రవేశ పెట్టిన మంత్రులు …
-మున్సిపల్‌శాఖ చట్ట సవరణ, అజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ బిల్లులను మంత్రి కేటీఆర్‌,
-వైద్య ఆరోగ్యశాఖ సవరణ బిల్లును పెట్టిన హరీష్ రావు
-తెలంగాణ మోటర్‌ వెహికిల్స్‌ టాక్సేషన్‌ సవరణ బిల్లులును సభలో ప్రవేశ పెట్టిన మంత్రి అజయ్
-జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్
-అటవీ యూనివర్సిటీ బిల్లును ప్రవేశ పెట్టిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి,
-యూనివర్సిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభం అయ్యాయి. వర్షాకాల సమావేశాలను ప్రారంభించిన కేసీఆర్ సర్కార్ అతితక్కువ సమయం నిర్వహించాలని నిర్ణయించడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఉన్నాయి. ఆరవ తేదీన ప్రారంభమైన సమావేశాలు తిరిగి 12 ప్రారంభం అయ్యాయి. ప్రారంభం రోజున కొద్దినిమిషాలే సమావేశం జరగటం ప్రతిపక్షాలతో పాటు అధికార పక్ష సభ్యులను సైతం విస్మయానికి గురిచేసింది. సోమవారం సమావేశంలో మంత్రులు వివిధ బిల్లులను ప్రవేశ పెట్టారు . వాటిపై లఘు చర్చలు జరిగి సభ ఆమోదం పొందాయి.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బీ భూపతిరావు మృతికి సంతాపంగా శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. రెండు నిమిషాలపాటు సభ సంతాపం తెలిపింది. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతోపాటు మున్సిపల్‌శాఖ చట్ట సవరణ, అజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ బిల్లులను మంత్రి కేటీఆర్‌, వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సవరణకు సంబంధించిన బిల్లును మంత్రి హరీశ్‌రావు, అటవీ యూనివర్సిటీ బిల్లును మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు సంబంధించిన బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ మోటర్‌ వెహికిల్స్‌ టాక్సేషన్‌ సవరణ బిల్లులును మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రవేశపెట్టారు. విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తిరస్కరించారు.

అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లు-పర్యవసానాలపై లఘు చర్చను ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ప్రారంభించారు. ఇదే అంశంపై మండలిలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి లఘు చర్చను ప్రారంభించారు.

Related posts

కలకత్తా హైకోర్టులో 1951లో దాఖలైన దావాకు 2023లో పరిష్కారం!

Drukpadam

హైదరాబాదులో మోహన్ బాబును కలిసిన మంత్రి పేర్ని నాని…

Drukpadam

The Art of Photography as Therapy for Your Clients

Drukpadam

Leave a Comment