Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మావోయిస్టుల ఇలాఖాలో పోలీస్ బాస్ …

మావోయిస్టుల ఇలాఖాలో పోలీస్ బాస్ లు

చెన్నాపురం సిఆర్పిఎఫ్ క్యాంపు ను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి,సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్ సింగ్.

చర్ల మండలం చెన్నాపురం వద్ద ఏర్పాటు చేసిన సిఆర్పిఎఫ్ క్యాంపు నిర్మాణం పూర్తి కావడంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఐపిఎస్,సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్ సింగ్ ఐపిఎస్ లు హైదరాబాద్ నుండి హెలికాఫ్టర్ ద్వారా చెన్నాపురం చేరుకుని అధికారికంగా సీర్పీఎఫ్ క్యాంపు ను ప్రారంభించారు.ఇద్దరు డీజీపీలతో పాటు అడిషనల్ డీజీపీ ఎస్.ఎస్ చతుర్వేది ఐపిఎస్,సౌత్ జోన్ సీర్పీఎఫ్ అడిషనల్ డీజీ నలినీ ప్రభాత్ ఐపిఎస్,సదరన్ సెక్టార్ సీఆర్పీఎఫ్ ఐజీ మహేష్ చంద్ర లడ్డా ఐపిఎస్,కుంట సీఆర్పీఎఫ్ డిఐజి రాజీవ్ కుమార్ ఠాకూర్,డిఐజి ఎస్.ఎన్ మిశ్రా మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముందుగా జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ అక్కడకు విచ్చేసిన గౌరవ డీజీపీలకు పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు.అనంతరం అధికారులందరూ క్యాంప్ పరిసరాలను మరియు అధికారులు,సిబ్బంది కొరకు అక్కడ ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు.తర్వాత అక్కడ పాల్గొన్న అధికారులు,సిబ్బంతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గోన్నారు.ఈ సందర్భంగా డిజిపి ఎం.మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ మావోయిస్టు వ్యవస్థ నిర్మూలన కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలను పటిష్టం చేసేందుకు గాను ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేయడంలో భాగంగా జిల్లాలోని చెన్నాపురం,పూసుగుప్ప, ఉంజుపల్లి,చెలిమల,తిప్పాపురం,కలివేరు క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా పోలీసు యంత్రాంగం మరియు సీఆర్పీఎఫ్ బలగాల సమన్వయంతో ఛత్తీస్ఘడ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అమాయకపు ఆదివాసి గిరిజనులపై దుశ్చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులు తెలంగాణలో ఆదరణ కోల్పోయారని అన్నారు.అనంతరం సిఆర్పిఎఫ్ డిజిపి కుల్దీప్ సింగ్ ఐపీఎస్ మాట్లాడుతూ మావోయిస్టులను నిర్మూలించడంలో తెలంగాణ-ఛత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతాల పోలీసుల పనితీరు ప్రశంసనీయం అన్నారు.తదుపరి అక్కడ ఉన్న సిబ్బంది,అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.సీఆర్పీఎఫ్ కమాండెంట్లు ప్రశాంత్ ధర్,ప్రదుమాన్ కుమార్ సింగ్,బి.ఆర్ మండల్,సంజయ్ కుమార్ మరియు కొత్తగూడెం ఓఎస్డీ టి.సాయి మనోహర్,భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

బద్దలైన మౌంట్ సెమేరు అగ్నిపర్వతం.. 8 కిలోమీటర్ల వరకు డేంజర్ జోన్!

Drukpadam

లండన్‌లో రోడ్డు ప్రమాదం.. నెల రోజులుగా చికిత్స పొందుతున్న తెలుగు యువకుడి మృతి

Ram Narayana

ఎట్టకేలకు సీపీఎం తొలి జాబితా విడుదల.. పాలేరు నుంచి తమ్మినేని !

Ram Narayana

Leave a Comment