Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

భార‌త్ జోడో యాత్ర‌లో ‘విలాసాల విడిది’ ఆరోపణలపై సాక్ష్యంతో కూడిన‌ కాంగ్రెస్ వివ‌ర‌ణ !

భార‌త్ జోడో యాత్ర‌లో ‘విలాసాల విడిది’ ఆరోపణలపై సాక్ష్యంతో కూడిన‌ కాంగ్రెస్ వివ‌ర‌ణ !

  • భార‌త్ జోడో యాత్ర‌లో విలాసాల విడిది అంటూ వైరి వ‌ర్గాల ఆరోప‌ణ‌
  • నేల మీదే పార్టీ శ్రేణులు విశ్రాంతి తీసుకుంటున్న వీడియోను విడుద‌ల చేసిన కాంగ్రెస్ పార్టీ
  • వైరి వ‌ర్గాలు ఆరోపిస్తున్న విలాసాలు ఇవేనంటూ దెప్పిపొడుపు

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో పాలుపంచుకుంటున్న నేత‌ల‌కు ఆ పార్టీ విలాసాల‌తో కూడిన విడిది ఏర్పాటు చేసింద‌ని వైరివ‌ర్గాల నుంచి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో… వాటిపై కాంగ్రెస్ పార్టీ సోమ‌వారం ఓ వీడియో సాక్ష్యంతో వివ‌ర‌ణ ఇచ్చింది. సోమ‌వారం 14 కిలో మీట‌ర్ల మేర సాగిన యాత్ర అనంత‌రం యాత్ర‌లో పాలుపంచుకున్న నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఓ పెద్ద గోడౌన్‌లా క‌నిపిస్తున్న భ‌వ‌నంలో నేల మీదే ప‌రుపులు వేసుకుని ప‌డుకున్నారు.

ఈ విడిదిలో పురుషులు, మ‌హిళ‌లు అన్న తేడా లేకుండా పార్టీ శ్రేణులంతా ఎవ‌రికి వారుగా త‌మ‌కు ఇచ్చిన ప‌రుపులు ప‌ర‌చుకుని ప‌డుకున్నారు. భార‌త్ జోడో యాత్ర‌లో 5 స్టార్ విలాసాలు అంటూ వైరి వ‌ర్గాలు ఆరోపిస్తున్న విలాసాల‌తో కూడిన విడిది ఇదేనంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోష‌ల్ మీడియా జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యురాలు మ‌నీష్ కందూరి తెలిపారు.

Related posts

బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణమన్న కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన హరీశ్ రావు

Drukpadam

యూపీ పోలీసులకు అసదుద్దీన్ వార్నింగ్…

Drukpadam

విజయమ్మ, షర్మిల ప్రాణాలకు ముప్పు … డీఎల్ డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment