తారతమ్యాలు లేకుండా జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు..జిల్లా అధ్యక్షులు మధుగౌడ్..
జిల్లాలో పనిచేసే జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు …డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు
ఎవరు నిరుత్సాహపడొద్దు …
వనపర్తి జిల్లా పరిధిలో జర్నలిస్ట్ లుగా పనిచేసే అందరికీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్ది నిరంజన్ రెడ్డి సహకారంతో డబల్ బెడ్ రూంలు, ఇళ్ల స్థలాలు వస్తాయని ఎవ్వరూ కూడా నిరుత్సాహనికి గురి కావద్దని వనపర్తి జిల్లా TUWJ(IJU) సంఘం జిల్లా అధ్యక్షులు మధు గౌడ్ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సమావేశంలో ఆయన పాల్గొనే మాట్లాడారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపులో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించి జర్నలిస్టు మిత్రుల తరఫున అహర్నిశలు ఆలోచిస్తున్నాడని మంత్రి చొరవతోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు చివరి దశలో ఉందని అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఇండ్ల స్థలాలకు సంబంధించిన లేఔట్లను తయారు చేస్తున్నారని ఆయన తెలిపారు.
జిల్లా పరిధిలో పనిచేసే జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు అందుతాయన్నారు.
ఇప్పటికే కొన్ని మండలాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చొరవతో ఇళ్ల స్థలాలు అందాయని మిగిలిన జర్నలిస్టు మిత్రులందరికీ త్వరలోనే ఇళ్లస్థలాల పంపిణీ జరుగుతోందని ఎవరు కూడా నిరుత్సాహానికి గురికా వద్దన్నారు. గోపాల్పేట్, శ్రీరంగాపురం మండలాల జాబితాను కలెక్టర్ ముందు ఉంచడం జరిగింది అతి త్వరలో ఈ రెండు మండలాల్లో కూడా స్థలాల కేటాయించి డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం చేపట్టనున్నామని అధ్యక్షుడు పేర్కొన్నారు.
మంత్రి ప్రత్యేక చొరవ తో కొల్లాపూర్ ఎమ్మెల్య హర్షవర్ధన్ రెడ్డితో మాట్లాడిన మంత్రి విపనగండ్ల, చిన్నంబావి జర్నలిస్టులందరికీ స్థలాలు కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాలు చేపట్టారని అదేవిధంగా పెబ్బేరు మండలా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగుతుందని ఆయన గుర్తు చేశారు. జర్నలిస్టుల అభిప్రాయ సేకరణ చేసి తయారుచేసిన జాబితాను మంత్రికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డి. మాధవరావు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ బోలేమోని రమేష్, హెల్త్ కన్వీనర్ దినేష్, పాత్రికేయులు ఉషన్న పోలిశెట్టి బాలకృష్ణ ప్రశాంత్ పౌర్ణరెడ్డి రవీందర్ రెడ్డి కొండన్న యాదవ్ రాజు లట్టుపల్లి రవికాంత్ ,జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నవీన్ కుమార్ గౌడ్ కార్యదర్శి శివకుమార్ పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి మన్యం జర్నలిస్టులు , వేణుగోపాల్ యాదవ్, బి బాబు, కుమార్ తదితర జర్నలిస్టు మిత్ర బృందం పాల్గొన్నారు.