Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణాలో భారత్ జోడో యాత్ర ఈనెల 24 నుంచి 13 రోజులు ..డీజీపీ అనుమతి కోరతామన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి!

తెలంగాణాలో భారత్ జోడో యాత్ర ఈనెల 24 నుంచి 13 రోజులు ..డీజీపీ అనుమతి కోరతామన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి!
క‌ర్ణాట‌క‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ యాత్ర‌
తెలంగాణ‌లో యాత్ర‌పై స‌మీక్ష నిర్వ‌హించిన రేవంత్ రెడ్డి
యాత్ర కోసం స‌బ్ క‌మిటీలు ఏర్పాటు చేయ‌నున్నట్లు వెల్ల‌డి
తెలంగాణ లో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ ఫైనల్.
తెలంగాణలో మొత్తం 13 రోజులకే కుదించిన రాహుల్ పాదయాత్ర.
తెలంగాణలో 359 కిలోమీటర్లు నడవనున్న రాహుల్ గాంధీ.
13 రోజుల పాటు రోజు వారీగా రాహుల్ యాత్రలో పాల్గొనే నియోజకవర్గాల జాబితా కూడా సిద్ధం.
మక్తల్ నియోజకవర్గం లోని కృష్ణా మండలం, కృష్ణా గ్రామం వద్ద తెలంగాణలోకి ఎంట్రీ కానున్న భారత్ జోడో యాత్ర..

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర పేరిట చేప‌ట్టిన పాద‌యాత్ర శుక్ర‌వారం కేర‌ళ నుంచి క‌ర్ణాట‌క‌లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. క‌ర్ణాట‌క‌లో యాత్ర‌ను ముగించుకున్న అనంత‌రం ఏపీ మీదుగా రాహుల్ యాత్ర తెలంగాణ‌లోకి ప్ర‌వేశిస్తుంది. అక్టోబ‌ర్ 24న రాహుల్ యాత్ర తెలంగాణ‌లోకి అడుగుపెట్ట‌నుంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… రాహుల్ పాద‌యాత్ర‌పై కీల‌క నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

తెలంగాణ‌లో రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌ను దిగ్విజ‌యం చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకోసం స‌బ్ క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకుని ఆ క‌మిటీల‌కు పార్టీ సీనియ‌ర్ల‌ను ఇంచార్జీలుగా నియ‌మిస్తామ‌ని తెలిపారు. ఇక తెలంగాణ‌లో రాహుల్ పాద‌యాత్ర‌కు అనుమ‌తి కోసం శ‌నివారం డీజీపీని క‌ల‌వ‌నున్న‌ట్లు రేవంత్ తెలిపారు.

1వ రోజు..
మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో భారత్ జోడో యాత్ర..
రాహుల్ పాదయాత్ర లో కొడంగల్, నారాయణ పేట, గద్వాల్, అలంపూర్ నియోజకవర్గ నేతలతోపాటు రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొంటారు.

2వ రోజు..
దేవరకద్ర నియోజకవర్గంలో కల్వకుర్తి, దేవరకొండ, వనపర్తి, అచ్చంపేట సెగ్మెంట్ నేతలు..

3వ రోజు..
మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ రాహుల్ పాదయాత్రలో తాండూర్, పరిగి, దేవరకొండ మినహా నల్గొండ పార్లమెంట్ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.

4వ రోజు..
జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్లో రాహుల్ పాదయాత్ర..
నాగర్ కర్నూల్ ఖమ్మం లోక్ సభలోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలు పాల్గొంటారు.

5వ రోజు..
షాద్ నగర్ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర..
మహేశ్వరం అసెంబ్లీ తోపాటు భువనగిరి లోక్ సభ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.

6వ రోజు..
శంషా బాద్ ప్రాంతంలో జరిగే యాత్రలో హైదరాబాద్ లోక్ సభలోని అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గ నేతలు.

7వరోజు..
శేరిలింగంపల్లి నియోజకవర్గం రాహుల్ పాదయాత్ర..
ఈ పాదయాత్రలో చేవెళ్ల లోక్ సభలోని మహేశ్వరం, రాజేంద్ర నగర్ మినహా మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లు, సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నేతలు పాల్గొంటారు.

8వ రోజు..
బీహెచ్ఈఎల్ ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర సాగనుంది.
ఈ యాత్రలో మల్కాజ్ గిరి, మహబూబా బాద్ పార్లమెంట్ పరిధిలోని నేతలు పాల్గొంటారు.

9వ రోజు..
సంగారెడ్డి లో కొనసాగనున్న రాహుల్ యాత్ర..
మెదక్, వరంగల్ లోక్ సభ పరిధిలోని నేతలు పాల్గొంటారు.

10వ రోజు..
జోగి పేట లో కొనసాగనున్న రాహుల్ యాత్ర..
ఈ యాత్రలో జహీరాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని నేతలు పాల్గొంటారు.

11వ రోజు..
శంకరం పేట ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర..
ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.

12 వ రోజు..
జుక్కల్ ప్రాంతాల్లో సాగనున్న రాహుల్ యాత్ర.. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలు హాజరు.

13వ రోజు..
జుక్కల్ లోనే సాగనున్న యాత్ర..
కరీంనగర్ లోక్ సభ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలతోపాటు రాష్ట్ర వ్యాప్త ముఖ్య నేతలు పాల్గొంటారు.

13వ రోజు సాయంత్రం తో తెలంగాణలో ముగియనున్న రాహుల్ పాదయాత్ర.

Related posts

ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో చంద్రబాబుకు ఘన స్వాగతం..!

Drukpadam

ఏపీలో టీడీపీకి మరో షాక్.. సీనియర్ నేత కుతూహలమ్మ రాజీనామా!

Drukpadam

మోదీ రాజీనామా చేయాలంటూ మోతెక్కిపోతున్న ట్విట్టర్

Drukpadam

Leave a Comment