Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జాతీయపార్టీ పేరుతోనే మునుగోడు ఎన్నికలకు …పార్టీ సమావేశంలో కేసీఆర్!

జాతీయపార్టీ పేరుతోనే మునుగోడు ఎన్నికలకు …పార్టీ సమావేశంలో కేసీఆర్!
-దసరా రోజున జాతీయ పార్టీ పేరు ప్రకటించనున్న సీఎం కేసీఆర్
-మంత్రులు, జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ సమావేశం
-పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం
-కొత్త పార్టీ పేరుతో మునుగోడు బరిలో దిగుతామని వెల్లడి
-తమదే విజయం అని ధీమా
-సర్వేలన్నీ తమకే అనుకూలమని స్పష్టీకరణ

టీఆర్ యస్ అధినేత ,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయపార్టీ పెట్టడం ఖాయమైంది.ఈ మేరకు ఈరోజు రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ లో జరిగిన అత్యన్నత సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు .తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న నాయకుడిగా కేసీఆర్ కు పేరుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణకు బాటలు వేశామని ,అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడమే కాకుండా రైతుబంధు ,దళితబందు ,ఉచిత కరెంట్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చిరాస్టయిగా నిలిచిపోయామని టీఆర్ యస్ నమ్ముతుంది.ఈపథకాలు దేశమంతా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అందువల్ల జాతీయపార్టీ పెట్టాలని తమపై అనేక రాష్ట్రాల నుంచి వత్తిడి పెరుగుతుందని కేసీఆర్ పార్టీనేతలతో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు . పార్టీ హిట్టా ఫట్టా అనే విషయం పక్కన పెడితే పార్టీ పెట్టడం మాత్రం ఖాయమైంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు అయిన నేపథ్యంలో పార్టీ ప్రకటన దుందంగా చేయాలనీ కేసీఆర్ నిర్ణయించారు . . తాను స్థాపించబోయే జాతీయ పార్టీ పేరును దసరా రోజున ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో హైదరాబాదులో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది.

తాజా రాజకీయ పరిణామాలు, కొత్త పార్టీ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ భవన్ లో దసరా రోజున టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున జాతీయ పార్టీ పేరు ప్రకటించనున్నారు. డిసెంబరు 9న ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, మునుగోడులో అన్ని సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. జాతీయ పార్టీ పేరుతోనే మునుగోడు ఎన్నికల బరిలో దిగుతామని స్పష్టం చేశారు. ఈసారి మునుగోడు బరిలో మూడు జాతీయ పార్టీలు ఉంటాయని అన్నారు.

Related posts

రేపు ఈడీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న సోనియా గాంధీ!

Drukpadam

ట్యాంక్‌ బండ్ పై వైఎస్ షర్మిల అరెస్ట్.. మౌన దీక్ష భగ్నం…

Drukpadam

అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ మాత్రమే!: కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి స్పష్టీకరణ…

Drukpadam

Leave a Comment