Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మునుగోడు ఎన్నికల్లో మూకుమ్మ‌డి నామినేష‌న్లు…

మునుగోడు ఎన్నికల్లో మూకుమ్మ‌డి నామినేష‌న్లు ఖాయం… రెడీ అవుతున్న వీఆర్ఏలు…

  • -స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రోజుల త‌ర‌బ‌డి నిరాహార దీక్ష‌లు చేస్తున్న వీఆర్ఏలు
  • -ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా మునుగోడు ఉప ఎన్నిక‌లో నామినేష‌న్లు వేయాల‌ని నిర్ణ‌యం
  • -వీఆర్ఏల బాట‌లోనే లారీ డ్రైవ‌ర్స్ అసోసియేష‌న్‌, భూ నిర్వాసితులు

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వర్గానికి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లో భారీ ఎత్తున నామినేష‌న్లు దాఖ‌లు అయ్యే సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రోజుల త‌ర‌బ‌డి నిరాహార దీక్ష‌లు చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ)లు ఉప ఎన్నిక‌ల్లో త‌మ కుటుంబ స‌భ్యుల‌తో మూకుమ్మ‌డిగా నామినేష‌న్లు దాఖ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

వీఆర్ఏల‌తో పాటు లారీ డ్రైవ‌ర్స్ అసోసియేష‌న్‌, భూ నిర్వాసితులు కూడా మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో మూకుమ్మ‌డిగా నామినేష‌న్లు వేసే దిశ‌గా క‌దులుతున్నారు. ఫ‌లితంగా మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో భారీ సంఖ్య‌లో నామినేష‌న్లు దాఖ‌లు కానున్నాయి. గ‌తంలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పోటీ చేసిన నిజామాబాద్ లోక్ స‌భ స్థానానికి ప‌సుపు రైతులు పెద్ద సంఖ్య‌లో నామినేష‌న్లు దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

Related posts

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపండి: ఏపీకి కృష్ణా యాజమాన్య బోర్డు ఆదేశం

Drukpadam

మాయల పకీరు మాటలు నమ్మొదు…పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ram Narayana

హిమాచల్ ప్రదేశ్‌లో 8 మంది మంత్రుల ఓటమి!

Drukpadam

Leave a Comment