విశాఖ రాజధానికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా!
- అమరావతి రైతుల పాదయాత్రకు పోటీగా వైసీపీ ర్యాలీలు
- విశాఖ రాజధానికి మద్దతుగా జేఏసీ కూడా ఏర్పాటు
- అధికార వికేంద్రీకరణ కోసం రాజీనామా చేస్తున్నానన్న ధర్మశ్రీ
మూడు రాజధానులపై తగ్గేదేలేదన్నుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు అందుకు రాజీనామాలకు సైతం సిద్ధపడ్డారు .విశాఖకు చెందిన కరుణం ధర్మశ్రీ తన రాజీనామా ప్రకటించగా అదే దారిలో బీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ తాను రాజీనామాకు సిఅద్దామని ప్రకటించారు.ఇక మంత్రి ధర్మాన, ఎమ్మెల్యే మాజీ మంత్రి కృష్ణ దాస్ లు చంద్రబాబు డ్రామాలపై భగ్గుమన్నారు.మా ప్రాంతానికి రాజధాని వద్దని చెబుతూ ఇక్కడకు పాదయాత్రకు రావడంపై వారు గుర్రుగా ఉన్నారు .,
అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్ర నేపథ్యంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రైతుల పాదయాత్రకు పోటీగా వైసీపీ శ్రేణులు ర్యాలీలను నిర్వహిస్తున్నాయి. విశాఖ రాజధానికి మద్దతుగా జేఏసీ కూడా ఏర్పాటయింది. ఈ జేఏసీ సమావేశం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ కు అందించారు. ఉత్తరాంధ్ర వ్యతిరేకులను రాజకీయంగా బహిష్కరించాలని చెప్పారు. అధికార వికేంద్రీకరణ కోసం తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇదే సమయంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఆయన సవాల్ విసిరారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అచ్చెన్నాయుడికి దమ్ముంటే రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. అచ్చెన్నాయుడిపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని చెప్పారు.