Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీఎం కేసీఆర్ కు జ్వరం… మరో నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే

సీఎం కేసీఆర్ కు జ్వరం… మరో నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే!
-గత వారం ములాయం అంత్యక్రియల కోసం యూపీ వెళ్లిన కేసీఆర్
-అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి
-కేసీఆర్ ఆదేశాలతో ఢిల్లీ వెళ్లిన సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్

బీఆర్ యస్ నేత తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఢిల్లీ పర్యటనలో అస్వస్థతకు గురైయ్యారు. గతవారం ములాయం సింగ్ అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్ అటునుంచి ఆటే ఢిల్లీ వెళ్లి పోయారు. అక్కడ నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని పరిశీలించడంతో పాటు అద్దెకు తీసుకొన్న బీఆర్ యస్ భవనాన్ని కూడా చూశారు . అక్కడే కొన్ని రోజులు ఉండి జాతీయరాజకీయాలపై ద్రుష్టి సారించాలని అనుకున్నారు . ఇక్కడ మునుగోడు ఎన్నిక జరుగుతున్నా తరణంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే అనుకోకుండా సోమవారం ఆయనకు జ్వరం రావడంతో ఢిల్లీలోని చికిత్స తీసుకుంటుంన్నారు . అందువల్ల మరో 4 రోజులు అక్కడే ఉంటారని గులాబీ నేతలు చెపుతున్నారు .

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు సోమవారం జ్వరం వచ్చింది. గత వారం సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉత్తర ప్రదేశ్ వెళ్లిన కేసీఆర్…ఆ కార్యక్రమం అనంతరం అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారం పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటున్నారు.

తాజాగా సోమవారం ఆయన జ్వరం బారిన పడటంతో మరో నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. సీఎం ఆదేశాల మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ లు ఢిల్లీకి వెళ్లారు. వారితో రాష్ట్రంలో అమలు జరుగుతున్నా కార్యక్రమాలను గురించి చర్చించి కొన్ని సూచనలు చేయనున్నట్లు తెలుస్తుంది. అందువల్ల తెలంగాణ సీఎం ఓ మరికొన్ని రోజులు ఢిల్లీ నుంచి పరిపాలన సాగించే అవకాశాలు ఉన్నాయి.మరికొందరు అధికారులు కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం ..

Related posts

రేవంత్ రెడ్డిపై సోనియాకు ఫిర్యాదు… ఆయన కూడా సీరియస్ ?

Drukpadam

చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ చేసింది: భూమ‌న…

Drukpadam

9వ రౌండ్ ఫలితాల వెల్లడి: మళ్లీ ఈటలే ముందంజ.. భారీ మెజారిటీ

Drukpadam

Leave a Comment