Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

యుద్ధం ముగింపునకు ఇదే ప్రారంభం: జెలెన్ స్కీ

యుద్ధం ముగింపునకు ఇదే ప్రారంభం: జెలెన్ స్కీ

  • ఖేర్సన్ సిటీ స్వాధీనంపై ఉక్రెయిన్ అధ్యక్షుడి వ్యాఖ్య
  • సిటీలో పర్యటించి అందరినీ ఆశ్చర్యపరిచిన జెలెన్ స్కీ
  • సైనికులతో కలిసి జాతీయ గీతం ఆలపించిన ప్రెసిడెంట్
  • తమ సైన్యానికి కీలక విజయమని ప్రకటన

రష్యా ఆక్రమించిన ఖేర్సన్ సిటీని తిరిగి స్వాధీనం చేసుకోవడం యుద్ధం ముగింపునకు సూచన అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ ప్రకటించారు. తమ సైనికుల ధైర్యసాహసాల వల్లే కీలకమైన నగరాన్ని తిరిగి దక్కించుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంతో రష్యాకు గుణపాఠం చెప్పారని తన సైనికులను మెచ్చుకున్నారు. సోమవారం అకస్మాత్తుగా ఖేర్సన్ నగరంలో పర్యటించి జెలెన్ స్కీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ఇంతకాలం రష్యా సైన్యం ఆధీనంలో ఉన్న ఖేర్సన్ సిటీలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ సహా పలు ప్రాంతాలను తనిఖీ చేశారు. ఆ తర్వాత సైనికులతో కలిసి జెలెన్ స్కీ జాతీయ గీతాన్ని ఆలపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా, రష్యాను తక్కువ అంచనా వేయొద్దని జెలెన్ స్కీకి పలు దేశాలు సూచిస్తున్నాయి. రష్యా సైనిక బలగాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, ఖేర్సన్ నుంచి వెనక్కి మళ్లడంలో పుతిన్ ఆలోచనలను తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించాయి.

ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఆక్రమించిన నాలుగు కీలక నగరాల్లో ఖేర్సన్ కూడా ఒకటి. ఉక్రెయిన్ కు చెందిన ఈ నగరాలలో రెఫరెండం నిర్వహించి రష్యా తన భూభాగంలో కలిపేసుకుంది. ఇకపై డోనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపరోజియా నగరాలు రష్యావేనని ప్రకటించింది. ఆ నగరాలపై దాడి చేస్తే రష్యా భూభాగంపై దాడిగానే పరిగణించి ప్రతిదాడులకు దిగుతామని ఉక్రెయిన్ ను హెచ్చరించింది. అయితే, ఈ నగరాలను కాపాడుకోవడం రష్యాకు అసాధ్యంగా మారింది. దీంతో కిందటి శుక్రవారం(ఈ నెల 11న) ఖేర్సన్ నుంచి తన బలగాలను ఉపసంహరించుకుంది. రష్యన్లు ఖాళీ చేసిన తర్వాత ఖేర్సన్  తిరిగి ఉక్రెయిన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Related posts

This 50 Years Old Woman Reveals Secrets of Beauty Through Eating

Drukpadam

భద్రాద్రిలో శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు!

Drukpadam

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు వినోద్ దువాపై దేశ ద్రోహం కేసు కొట్టివేత…

Drukpadam

Leave a Comment