Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎపిలో న్యాయవాదుల నిరసన!

న్యాయమూర్తుల బదిలీలను నిరసిస్తూ.. విధులు బహిష్కరించిన ఏపీ హైకోర్టు న్యాయవాదులు 

  • జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ ల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
  • దక్షిణాది న్యాయమూర్తులపై వివక్ష చూపుతున్నారని లాయర్ల నిరసన
  • హైకోర్టు వద్ద ఆందోళన
AP High Court lawyers protest amid transfer of two judges

ఏపీ హైకోర్టుకు చెందిన జడ్జిలను బదిలీ చేయడంపై హైకోర్టు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ లను బదిలీ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ, విధులను బహిష్కరించారు. ఉత్తరాది, దక్షిణాది న్యాయమూర్తుల పట్ల సుప్రీంకోర్టు కొలీజియం వివక్ష చూపుతోందని న్యాయవాదులు విమర్శించారు.

దేశంలోని వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు జడ్జిలను ఇతర హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిన్న సిఫారసు చేసింది. వీరిలో ఏపీ హైకోర్టు, మద్రాస్ హైకోర్టుల నుంచి ఇద్దరేసి, తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు ఉన్నారు. జస్టిస్ దేవానంద్ ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ డి.రమేశ్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది.

Related posts

అన్న వదిలిన బాణం రివర్స్ అయి0ది …షర్మిల కా0గ్రెస్ లో చేరికపై చంద్రబాబు

Ram Narayana

కౌంటింగ్‌కు ఏపీ సన్నద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్…

Ram Narayana

త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీదే విజయమంటున్న ఎగ్జిట్ పోల్స్…!

Drukpadam

Leave a Comment