Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులుగా ట్రాన్స్‌జెండర్లు!

ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులుగా ట్రాన్స్‌జెండర్లు!

  • రాష్ట్రంలోనే తొలిసారి ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు ఉస్మానియాలో వైద్యులుగా అవకాశం
  • వారిని చేర్చుకునేందుకు పలు ప్రైవేటు ఆసుపత్రుల నిరాకరణ
  • నారాయణగూడలో ట్రాాన్స్‌జెండర్ క్లినిక్ ఏర్పాటు
  • అంతలోనే ఉస్మానియాలో కాంట్రాక్ట్ వైద్యులుగా అవకాశం

హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రిలో తొలిసారి ఇద్దరు ట్రాన్స్‌జెండర్ వైద్యులు విధుల్లో చేరి రికార్డులకెక్కారు. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైన వీరిద్దరూ యాంటీ రిట్రోవైరల్ విభాగంలో సేవలందించనున్నారు.  వీరిలో ఒకరు ఖమ్మం జిల్లాకు చెందిన రుత్ జాన్‌పాల్ కొయ్యాల కాగా, మరొకరు ఆదిలాబాద్ రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన ప్రాచి రాథోడ్.

రుత్ జాన్‌పాల్ 2018లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ఆ తర్వాత నగరంలో వైద్యురాలిగా ప్రాక్టీస్ చేయాలని తలపోసినా ప్రయత్నాలు సఫలం కాలేదు. ట్రాన్స్‌జెండర్ అన్న కారణంతో ఎవరూ అవకాశం ఇవ్వలేదు. చివరికి గతేడాది నారాయణగూడలో తన స్నేహితురాలైన డాక్టర్ ప్రాచితో కలిసి ‘మిత్ర’  ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ఏర్పాటు చేశారు. ఇప్పుడా క్లినిక్‌కు చుట్టుపక్కల మంచి పేరుంది. అయితే, ఇప్పుడీ వైద్యులకు ఉస్మానియా ఆసుపత్రి నుంచి కాంట్రాక్ట్ వైద్యులుగా అవకాశం రావడంతో ఆలస్యం చేయకుండా ఓకే చెప్పేశారు.

ఇక, ఆదిలాబాద్ రిమ్స్‌లో ఎంబీబీఎస్, ఎమర్జెన్సీ మెడిసన్ పూర్తి చేసిన ప్రాచి రాథోడ్ ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో మూడు సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఆమె ట్రాన్స్‌జెండర్ అన్న విషయం తెలిసి ఉద్యోగం నుంచి తొలగించారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణలో పేరుమోసిన ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యురాలిగా చేరారు. ట్రాన్స్‌జెండర్ వైద్యులకు ఆసుపత్రిలో అవకాశం కల్పించడంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ.. చాలా ఆనందంగా ఉందని అన్నారు.

Related posts

ఉప్పాడ బీచ్ లో ముందుకు వచ్చిన సముద్రం… తీవ్రంగా ఎగసిపడుతున్న అలలు

Ram Narayana

ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ… 14 డిమాండ్లతో ప్రతిపాదనలను సమర్పించిన టీడీపీ

Drukpadam

Nicole Kidman on Aging and Her Favorite Skin Care Products

Drukpadam

Leave a Comment