Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

రంగారెడ్డి జిల్లాలో కిడ్నాపైన యువతిని కాపాడిన పోలీసులు!

రంగారెడ్డి జిల్లాలో కిడ్నాపైన యువతిని కాపాడిన పోలీసులు!

  • గతంలో ప్రేమించుకున్న నవీన్ రెడ్డి, వైశాలి!
  • ఇటీవల వైశాలికి నిశ్చితార్థం
  • వైశాలి ఇంటిపై దాడి చేసిన కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి
  • నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఇవాళ 100 మంది వచ్చి ఓ యువతిని కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. డెంటల్ డాక్టర్ ముచ్చర్ల వైశాలిని నవీన్ రెడ్డి అనే యువకుడు పెద్ద సంఖ్యలో కుర్రాళ్లను వెంటేసుకుని వచ్చి కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. కాగా, నవీన్ రెడ్డి, అతడి గ్యాంగ్ కోసం తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టిన పోలీసులు, కొన్ని గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించారు. కిడ్నాపైన డాక్టర్ వైశాలిని కాపాడారు. ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లిన నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 

వైశాలి, నవీన్ గతంలో ప్రేమించుకున్నట్టు తెలుస్తోంది. పెళ్లికి వైశాలి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో నవీన్ రెడ్డి సివిల్ కోర్టు ద్వారా వారికి నోటీసులు పంపాడు. తాను, వైశాలి సహజీవనం చేశామని తెలిపాడు. 

ఇటీవల వైశాలికి నిశ్చితార్థం జరగడంతో భరించలేకపోయిన నవీన్ రెడ్డి… వైశాలి నివాసంపై దాడికి దిగాడు. వైశాలిని బలవంతంగా తనతో తీసుకెళ్లాడు. దాంతో ఆగ్రహించిన వైశాలి కుటుంబ సభ్యులు నవీన్ రెడ్డికి చెందిన మిస్టర్ టీ రెస్టారెంట్ ను అగ్నికి ఆహుతి చేశారు.

Related posts

యూపీ పోలీసును చెప్పుతో కొట్టిన మహిళ.. వీడియో ఇదిగో!

Ram Narayana

భర్తను చంపి ఐదు ముక్కలుగా నరికి కాలువలో విసిరేసిన భార్య!

Ram Narayana

బెంగళూరులో మహిళా ప్యాసింజర్ పై అత్యాచారం… క్యాబ్ డ్రైవర్ అరెస్ట్!

Drukpadam

Leave a Comment