Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నిత్యం వార్తల్లో వ్యక్తిగా రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు!

నిత్యం వార్తల్లో వ్యక్తిగా రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు!
-ఏసుక్రీస్తు కృప వల్ల కరోనా వ్యాప్తి తగ్గిందని అంటున్న డీహెచ్
-ఇటీవల సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన శ్రీనివాసరావు
-తాజా వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకెక్కిన వైనం
-ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

కోటి విద్యలు కూటికొరకే అనేది నానుడి ..కానీ మన తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు …తన విద్యలన్నీ అసెంబ్లీ సీటు కోసం ఉపయోగిస్తున్నాడనే విమర్శలను ముఠా గట్టుకుంటున్నారు . అక్కడ ఒక చారిటీ పెట్టి సమయం దొరికినప్పుడల్లా కొత్తగూడెం వచ్చి పలు సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు . ఇంతవరకు బాగానే ఉన్నా ఆయన ఏది చేసినా అందులో పరమార్థం ఉంటుందనేది చర్షనీయంశంగా మారింది.

.ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం అసెంబ్లీ సీటు పై కన్నేసిన శ్రీనివాసరావు సీఎం కాళ్లు పట్టుకొని విమర్శలకు గురైయ్యారు . ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో సైతం రజినీకాంత్ స్టైల్లో డైలాగు చెప్పారు . కేసీఆర్ ఆదేశిస్తే శ్రీనివాస్ రావు అమలు చేస్తాడని అన్నారు . తాజాగా కొత్తగూడెంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న శ్రీనివాస్ రావు యేసు కృపవల్లనే కరోనా వ్యాప్తి తగ్గిందని అనడం చర్చనీయాంశంగా మారింది. ఏదైనా ఆయన నిత్యం వార్తల్లో వ్యక్తిగా మిగులుతున్నారు .

శ్రీనివాసరావు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండున్నర సంవత్సరాల నుంచి కొవిడ్ మానవజాతి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ప్రపంచ మానవాళిని కొవిడ్ తరిమి తరిమి భయపెట్టిందని, ఇవాళ దాన్నుంచి అందరం పూర్తిగా విముక్తి పొందామని తెలిపారు.

“మనం అందించిన సేవలతో కాదు… ఏసు క్రీస్తు కృప వల్లే కరోనా వ్యాప్తి తగ్గింది. మంచిని ఆచరించాలని, మంచిని ప్రేమించాలని, మంచిని గౌరవించాలని చెప్పే మిగిలిన అన్ని జాతుల, ధర్మాల ప్రబోధాలను మనందరం ముందుకు తీసుకుపోవడం వల్ల మానవజాతిని కాపాడుకోగలిగాం. మనిషిగా పుట్టేందుకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు’ అని శ్రీనివాసరావు వివరించారు.

Related posts

ఢిల్లీలోని ఓ ఫేమస్ రెస్టారెంట్ లో లంచ్ చేసిన రాహుల్ అండ్ ఫ్యామిలీ…!

Ram Narayana

జైలు నుంచి విడుదలైన బండి సంజయ్.. సీపీ రంగనాథ్ పై ఆగ్రహం!

Drukpadam

కృష్ణయ్య హత్యను ఖండిస్తున్నాం …సీపీఎం

Drukpadam

Leave a Comment