Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీకి గాలి జనార్దన్ రెడ్డి గుడ్​బై.. కర్ణాటకలో కొత్త పార్టీ ప్రకటన!

బీజేపీకి గాలి జనార్దన్ రెడ్డి గుడ్బై.. కర్ణాటకలో కొత్త పార్టీ ప్రకటన!
అసెంబ్లీ ఎన్నికలు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం
కొంతకాలంగా బీజేపీపై అసంతృప్తిగా ఉన్న గాలి
కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరిట కొత్త పార్టీని ప్రకటించిన నేత
మైనింగ్ కింగ్ గా పేరున్న జనార్ధనరెడ్డి
బీజేపీలో ప్రకంపనలుమరికొద్దినెలల్లో కర్ణాటక ఎన్నికలు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కర్ణాటకలో రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. రాష్ట్రంలో కీలక నేత, మాజీ మంత్రి, ప్రము మైనింగ్ వ్యాపారి అయిన గాలి జనార్దన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజీనామా చేశారు. సొంతంగా కొత్త పార్టీని ప్రకటించారు. కొంతకాలంగా బీజేపీతో అసంతృప్తితో ఉన్న జనార్దన్ రెడ్డి పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం తన నివాసంపారిజాత’‌లో మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీకి గుడ్బై చెప్పిన ఆయన తన కొత్త పార్టీ పేరుకళ్యాణ రాజ్య ప్రగతి పక్షఅని ప్రకటించారు.

ఇకపై సొంత పార్టీతో రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని వెల్లడించారు. బీజేపీతో తన బంధం ముగిసిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకునేలా పార్టీని నిర్మిస్తానని తెలిపారు. కర్ణాటక ప్రజల హృదయాలను తమ పార్టీ గెలుచుకుంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త పార్టీతో రాబోయే, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని జనార్దన్రె డ్డి స్పష్టం చేశారు. పోటీ చేసే నియోజకవర్గాలతో పాటు పార్టీ మేనిఫెస్టో ను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. తాను గంగావతి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.

 

మూడు దశాబ్దలుగా కర్ణాటక బీజేపీ ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించిన గాలి జనార్ధనరెడ్డి ప్రకటన బీజేపీలో ప్రకంపనలు పుట్టిస్తుంది. అక్రమ మైనింగ్ కేసులో జైలు పాలైన గ్రానైట్ కింగ్ బీజేపీ పట్ల తన అసంతృప్తిని చాలాకాలంగా వ్యక్తం చేస్తున్నారు . కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో తనపాత్రను బీజేపీ విస్మరించడంపై ఆయన రగిలి పోతున్నారు . తన కష్టకాలంలో బీజేపీ పట్టించుకోకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు . తనను మాజీ సీఎం యడియూరప్ప, జగదీష్ షట్టర్ మాత్రమే ఇంటికి వచ్చి కలిశారని వెల్లడించారు . ఇది పార్టీని నమ్ముకొని దాన్ని అధికారంలోకి తీసుకోని వచ్చేందుకు అష్టకష్టాలు పడ్డ తనకు దక్కిన ప్రతిఫలంగా భావిస్తున్నానని అన్నారు .

 

Related posts

రాజయ్య ఇదేందేయ్య … మళ్ళీ వివాదంలో రాజయ్య…

Drukpadam

టీఆర్ యస్ ను పల్లెత్తు మాట అనని అమిత్ షా ..నిర్మల్ సభలో చప్పగా సాగిన ప్రసంగం!

Drukpadam

మోదీ హత్యకు కాంగ్రెస్ కుట్ర.. పంజాబ్ సీఎంను అరెస్ట్ చేయండి: అసోం సీఎం డిమాండ్!

Drukpadam

Leave a Comment