Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం బీఆర్ యస్ సభకు 5 లక్షల మంది !

ఈనెల 18 న ఖమ్మం లో 5 లక్షల మందితో బీఆర్ యస్ భారీ భారీ బహిరంగ సభ …హాజరు కానున్న ముగ్గురు సీఎంలు..
-బీఆర్ యస్ నేతలు …వివిధపార్టీల నాయకులు
-సభ ఏర్పాట్లపై సోమవారం ప్రగతి భవనం లో సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం …
-జిల్లాలో రాజకీయ మార్పులు జరుగుతున్నాయని జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం సభకు ప్రాధాన్యత

ఈనెల 18 న ఖమ్మంలో జిల్లా కలెక్టరేట్ సముదాయం ప్రారంభం సందర్భంగా బీఆర్ యస్ ఆధ్వరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు . బీఆర్ యస్ ఏర్పాటు అయిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న సభ అయినందున 5 లక్షలు తగ్గకుండా ప్రజలను సమీకరించాలని నిర్ణయించారు . ఈ మేరకు సోమవారం ప్రగతి భవనంలో సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలతో సుదీర్ఘంగా చర్చించారు . దేశంలో రాజకీయ పరిణామాలు బీఆర్ యస్ కు వస్తున్న ఆధారణపై సీఎం నేతలకు వివరించారు . ఖమ్మం సభకు ముగ్గురు సీఎంలు ఆహ్వానించనున్నట్లు తెలిపారు . ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం మాన్, కేరళ సీఎం పినారాయ్ విజయన్ వారిలో ఉన్నారు . వారే కాకా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు .

బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించినందుకు ఖమ్మం జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర కీలక నేతలు సోమవారం నాడు ప్రగతి భవన్ లో అధినేత సిఎం కెసిఆర్ ను కలిసి తమ కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా అధినేతతో సమావేశమైన ఖమ్మం జిల్లా నేతలు బహిరంగ సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేసేందుకు సంబంధించి చర్చించారు. తెలంగాణలో జరగనున్న మొట్టమొదటి బిఆర్ఎస్ సభను విజయవంతం చేసేందుకు అధినేత సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నేతలకు పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధు, ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, రేగా కాంతారావు, కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, తదితర నేతలున్నారు.

Related posts

వరదల కారణంగా ఏపీలో ఎంత మంది చనిపోయారంటే…?

Ram Narayana

మీడియా స్వేచ్ఛను అణిచే ప్రయత్నంలా ఉంది …ఏబీఎన్, టీవీ5లపై కేసులో సుప్రీం వ్యాఖ్య…

Drukpadam

ఖమ్మం జిల్లా టీఎన్జీఓ నూతన కార్యవర్గం కొత్త వరవడి!

Drukpadam

Leave a Comment