తెలుగు రాష్ట్రాలకు సంక్రాతి కనుక …వందే భారత్ రైలు
వందే భారత్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు
విశాఖ …సికింద్రాబాద్ మధ్య వారంలో ఆరురోజుల నడుస్తుంది
వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
నేలమీద నడిచే విమానం అంటున్న ప్రయాణికులు
తెలుగు రాష్ట్రాలకు మరో రైలు మరికొద్ది నెలల్లో
ధర అధికం …తగ్గనున్న ప్రయాణ సమయం
సౌకర్యాలు ఘనమే …
రైలంటే రైలు కాదు… చూడ్డానికి అలానే ఉన్నా… అస్సలు అలా అనలేం. అదోరకం నేల విమానం. భూమ్మీద వెళ్తుందనే మాట తప్ప… అందులో ప్రయాణం మాత్రం ఆకాశంలో విహరించినట్టే ఉంటుంది. అందులో జర్నీ చేస్తే.. మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది.ప్రయాణం సమయాన్ని తగ్గిస్తుంది.సౌకర్యవంతంగా ఉంటుంది.దానికి తగ్గట్లుగానే టికెట్స్ రేట్లు కూడా ఉంటాయి. మరొక రైలు మరి కొద్దీ నెలల్లో రానున్నదని రైల్వే అధికారులు అంటున్నారు .
యువర్ అటెన్షన్ ప్లీజ్! సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పండుగ కానుకగా ఈ నెల 15 ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకాబోతోంది. దేశానికే తలమానికంగా భావిస్తున్న వందేభారత్ తెలంగాణ, ఏపీలనుకలుపుతూ పరుగులు తియ్యబోతోంది. దేశంలో సెమీ బుల్లెట్ రైలుగా గుర్తింపు పొందిన వందేభారత్ రైలు ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టడానికి సిద్ధం అయింది. ఔట్ సైడ్ నుంచి అదిరిపోయే లుక్, ఇన్‌సైడ్‌లో ఓ రేంజ్‌లో ఉండే ఫెసిలిటీస్‌తో ఇప్పటికే అందరిని ఆకట్టుకుంటోంది వందే భారత్ ఎక్స్‌ప్రెస్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపు దిద్దుకోవడం దీని ప్రత్యేకత. అన్ని రాష్ట్రాలు ఈ రైలును తమ రాష్ట్రానికి రా రమ్మంటూ పట్టాలు పరిచి ఆహ్వానిస్తున్నాయి. ఈ రైలు కోసం అన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇప్పటికే ఏడు రైళ్లు పట్టాలెక్కగా, సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖకు ఎనిమిదో రైలు పరుగు ప్రారంభించనుంది. తెలుపు వర్ణం, దానిపై నీలి రంగు చారలు, బుల్లెట్ ట్రైన్ తరహాలో లోకో ముందు రూపు, వెడల్పాటి నలుపు రంగు కిటికీ వరస.. ఇలా చూడగానే ఆకట్టుకునే రూపంతో ఉన్న ఈ రైలు సికింద్రాబాద్–విశాఖను కలిపే కొత్త వారధిగా రూపు దిద్దుకుంటోంది. ప్రధాని మోదీ పండుగ రోజున వర్చువల్‌గా ప్రారంభించనున్న నేపథ్యంలో దీని ప్రత్యేకతలేంటో చూద్దాం.
వందే భారత్‌ని సెమీ బుల్లెట్ ట్రైన్‌గా చెప్పుకోవచ్చు. దీని లోపలకు అడుగు పెడితే ఎన్నో స్పెషాలిటీస్ పలకరిస్తాయి. ప్రస్తుతం దీని గరిష్ట వేగ పరిమితి గంటకు 160 కి.మీ. మాత్రమే. ఈ గరిష్ట వేగాన్ని 140 సెకన్లలో అందుకుంటుంది. ఫుల్లీ సస్పెండెడ్ ట్రాక్షన్ మోటార్‌తో తయారుచేసిన సరికొత్త బోగీలను ఈ ట్రైన్‌లో వినియోగించారు. ట్రైన్ ఎంత వేగంతో కుదుపులు అన్న మాటే ఉండదు. ఈ రైలుకు ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. వాటి నియంత్రణ లోకో పైలట్ వద్ద ఉంటుంది. మధ్యలో పాసింజర్స్ వాటిని తెరవలేరు, క్లోజ్ చేయలేరు. ట్రైన్ ఆగిన కొన్ని క్షణాలకు డోర్లు తెరుచుకుంటాయి. బయలుదేరడానికి కొన్ని సెకన్ల ముందు మూసుకుంటాయి.
ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు సేవలందిస్తుంది.
వైజాగ్ స్టేషన్ నుంచి ఈ ట్రైన్ (20833) ప్రతి రోజూ 5.55 గంటలకు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ రీచ్ అవుతుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ రైలు (20834) ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్టయ్యే ఈ ట్రైన్ .. రాత్రి 11.30 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది.
వందే భారత్ ట్రైన్ రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఆగుతుంది.
ఇందులో 14 ఏసీ ఛైర్ కార్లు, 2 ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 1128 మంది పాసింజర్స్ ట్రవెల్ చెయ్యొచ్చు
వందే భారత్ ఛార్జీల వివరాలు…
చెయిర్ కార్ ఛార్జీలు (ఒక పాసింజర్‌కు)..
• బేస్ ఫేర్: రూ.1,206
• సూపర్ ఫాస్ట్ ఛార్జీలు: రూ.45
• జీఎస్టీ: రూ.65
• రిజర్వేషన్ ఛార్జీలు: రూ.40
• కేటరింగ్ ఛార్జీలు: రూ.364
• మొత్తం: 1,720
ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీలు (ఒక పాసింజర్‌కు)…
• బేస్ ఫేర్: రూ.1,206
• సూపర్ ఫాస్ట్ ఛార్జీలు: రూ.75
• జీఎస్టీ: రూ.131
• రిజర్వేషన్ ఛార్జీలు: రూ.60
• కేటరింగ్ ఛార్జీలు: రూ.419
• మొత్తం: 3,170
టైమింగ్స్ ఇలా….
వైజాగ్ టూ సికింద్రాబాద్ ( 20833)
విశాఖ – ఉదయం 5 గంటల 55 నిమిషాలకు ప్రారంభం
రాజమండ్రి – 7 గంటల 55 నిమిషాలు
విజయవాడ – 10 గంటలకు
ఖమ్మం – 11 గంటలకు
వరంగల్ – మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు
సికింద్రాబాద్ – మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు
సికింద్రాబాద్ టూ వైజాగ్ ( 20834)
సికింద్రాబాద్ – మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం
వరంగల్ – మధ్యాహ్నం 4 గంటల 35 నిమిషాలు
ఖమ్మం – మధ్యాహ్నం 5 గంటల 45 నిమిషాలకు
విజయవాడ – విజయవాడు సాయంత్రం 7 గంటలకు
రాజమండ్రి – రాత్రి 8 గంటల 50 నిమిషాలకు
విశాఖ – రాత్రి 11 గంటల 30 నిమిషాలకు