Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటల , విశ్వేశ్వరరెడ్డి కలయిక బంధుత్వమా ? రాజకీయమా ?

ఈటల , విశ్వేశ్వరరెడ్డి కలయిక బంధుత్వమా ? రాజకీయమా ?
-తెలంగాణ లో టీఆర్ యస్ కు ప్రత్యాన్మయం దిశగా అడుగులు…
-రాజకీయ పునరేకీకరణకు జోరుగా ప్రయత్నాలు
-ఒక పక్క షర్మిల -మరోపక్క ఈటల ,విశ్వేశ్వరరెడ్డి
-ఉద్యమకారులు సైతం ఈటలకు మద్దతు తెలుపుతున్న వైనం
-కాంగ్రెస్ ,బీజేపీ లను ప్రజలు విశ్వసించటంలేదనే అభిప్రాయం

 

తెలంగాణాలో టీఆర్ యస్ కు వ్యతిరేకంగా ప్రత్యాన్మాయ దిశగా అడుగులు వేసేందుకు కొందరు పావులు కదుపుతున్నారా? … రాజకీయపునరేకీకరణకు అడుగులు పడుతున్నాయా ? అంటే అవుననే సమాధానమే వస్తుంది.ఈటల , విశ్వేశ్వరరెడ్డి కలయిక బంధుత్వమా ? రాజకీయమా ? అని అభిప్రాయాలు కూడా ఉన్నాయి .కేవలం బంధుత్వమే అంటున్నారు విశ్వేశ్వరరెడ్డి ,కాదు రాజకీయాలే అంటున్నారు పరిశీలకులు .   ఈటల భూకబ్జా ఆరోపణలతో కేసీఆర్ మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేశారు. ఈటల ఎటు ఆడుగులు వేస్తారు . ఆయన దారెటు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఆశక్తికరంగా మారింది. ఆయన ప్రత్యేక పార్టీ పెడతారా ? లేక ఏదైనా పార్టీలో చేరతారా ? అనేది చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఏకమవుతాయా ? అందుకు రకరకాల ఆలోచనలు ఉన్న వ్యక్తులు ,శక్తులు ఒకే ప్లాటుఫారం పైకి వస్తారా ? ఏది ఎంతవరకు సాధ్యం అవుతుంది అని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. పార్టీ పెట్టాం అంతే అంట తేలిక కాదు . ఇప్పటికే వైయస్ షర్మిల పార్టీ పెడతానని ప్రకటించారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కేసీఆర్ వ్యతిరేకశక్తులను కూడగట్టేందుకు ఎదురు చూస్తున్నారు. ఈటల మంత్రిగా భర్తరఫ్ అయిన తరువాత గురువారం ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా మీడియా ఆయన్ను ఎందుకు కలిశారని ప్రశ్నించగా ఇందులో ఏమిలేదు ఈటల భార్య తమకు దగ్గర భందువు అయినందున మర్యాదకోసం కలిశానని ఇందులో రాజకీయాలు ఏమి లేవని అన్నారు. గతంలో కలిసి పనిచేశామని అందువల్ల వాటిని కలిసిన సందర్భంగా గుర్తు చేసుకున్నామని అన్నారు. ఆయన పైకి చెప్పక పోయిన కేసీఆర్ కు ప్రత్యాన్మాయ రాజకీయాలకోసం ఆలోచనలు చేసినట్లు తెలుస్తుంది. తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాం ఈటల పై కక్ష్య పూరితంగానే మంత్రివర్గం నుంచి తొలగించారని అన్నారు. ఉద్యమకారులను బయటకు పంపటం అనేది మొదటి నుంచి కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలలో భాగమేనని అన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు కూడా ఈటలను కావాలనే మంత్రివర్గం నుంచి తొలగించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ యస్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనా సాగించటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ యస్ కుటుంబ పార్టీగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యమం రోజుల్లో ఉన్న టీఆర్ యస్ వేరు అధికారంలోకి వచ్చిన టీఆర్ యస్ వేరు అని ఉద్యమ కారులు అంటున్నారు. ఇందుకు తగ్గట్లుగానే కేసీఆర్ మంత్రివర్గంలో అత్యధికులు ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేనివారు ఉన్నారని విమర్శలు ఉన్నాయి. అంతే కాకుండా ఉద్యమకారులను ఒక్కొక్కరిని పార్టీ నుంచి పంపించిన చరిత్రను వారు గుర్తు చేస్తున్నారు. చివరకు ఈటల రాజేంద్ర ఎపిసోడ్ ను ప్రస్తావిస్తున్నారు. మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న ఈటల బయటికి పంపించాలనుకొని అందుకు తగ్గట్లుగా ఆయనపై ఆరోపణలు చేసి మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేశారని అంటున్నారు. ఈటల పై భూకబ్జా ఆరోపణల్లో వాస్తవాలు ఉంటె చర్యలు తీసుకోవడంలో ఎలాంటి తప్పులేదని కానీ దానిపై సమగ్ర విచారణ జరపాలని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ అయి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ సైతం అంటున్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని లేదా సిబిఐ చేత విచారణ జరిపించిన అభ్యంతరం లేదని అంటున్నారు. ఆయనపైనే కాకుండా భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులందరిపై విచారణ జరపాలనే డిమాండ్లు ముందుకొస్తున్నాయి. చివరకు ముఖ్యమంత్రి తనయుడు ,పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పైన కూడా ఆరోపణలను తెరపైకి వస్తున్నాయి . ఈ సందర్భంగా ప్రతిపక్షాలు సైతం దీనిపై పట్టుపడుతున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేటీఆర్ ,మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలపై విచారణకు డిమాండ్ చేస్తున్నారు. గురువారం ఆయన మీడియా , కాంగ్రెస్ నేతలతో కలిసి మల్లారెడ్డి , కేటీఆర్ భూములుగా చెప్పబడుతున్న ప్రాంతాలను సందర్శించారు. కాగా మల్లారెడ్డి రేవంత్ రెడ్డి చెప్పిన దగ్గర తనపేరుతో భూములే లేవని రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు . ఈటల విషయం లో కాంగ్రెస్ ,బీజేపీ లు కేసీఆర్ వైఖరిని తప్పుపడుతున్నాయి. ఎవరికీ వారు ఈటల రాజకీయ అడుగులుపై నిశితంగా గమనిస్తున్నాయి. తెలంగాణాలో రాజకీయ చాణిక్యుడుగా ఉన్న కేసీఆర్ పాచికల ముందు ప్రత్యాన్మాయ రాజకీయాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో చూడాలి మరి !

Related posts

వైయస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఖాయం….ఢిల్లీలో బిజీ ,బిజీ …

Ram Narayana

పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదు: బాలినేని

Drukpadam

ఎమ్మెల్యే వంశీపై సీనియర్ నేత దుట్టా ఫైర్!

Drukpadam

Leave a Comment