ఖమ్మం గుప్త హోటల్ నిర్వాకుల కొత్త ఆలోచన!
–జాతీయ జెండారంగులతో టిఫిన్స్
–వారి ఆలోచనలపై ప్రసంశలు
ఖమ్మం వైరా రోడ్ లో ఉడిపి హోటల్ నిర్వహిస్తున్న దూపుగుంట్ల జోగేశ్వర సత్య భగవాన్ గుప్త,శిరీష దంపతులకు ఒక కొత్త ఆలోచన వచ్చింది . దాన్ని ఆచరణలో పెట్టాలని ప్రయత్నించారు .రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఆకారంలో టిఫీన్ చేసి ప్రజలు అందించాలని భావించారు . వారి హోటల్ లో మన జాతీయ జెండా తరహా లో వారు రోజు అందించే టిఫిన్స్ కు రంగులు చేర్చి వాటిని తయారు చేయడం ఖమ్మం నగరంలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. వారికీ వచ్చిన ఆలోచనలను వర్కర్స్ కు చెప్పారు . అందరు కలిసి అందంగా టిఫిన్స్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు . వారు చేసిన ఆహార పదార్థాలను , జ్యూస్ ను చూసేందుకు ప్రజలు క్యూకట్టారు . బస్ డిపో ఎదురుగా దశాబ్దాలుగా గుప్త హోటల్ నడుపుతున్నారు . అక్కడ టిఫిన్ కు మంచి డిమాండ్ ఉంటుంది. వారికీ హోటల్ నడపడంలో మంచి అనుభవం ఉండటంతో వైరా రోడ్ లో ఉడిపి ఆహార్ హోటల్ నడుపుతూ శహబాస్ అనిపించు కుంటున్నారు . వారి ఆలోచనలను అందరు ప్రసంశిస్తున్నారు …