Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విద్యత్ శాఖ ఏసీడీ పేరుతో దొంగ చాటు వసూల్ …ఖమ్మంలో సిపిఎం ధర్నా

ఏసీడీ ల పేరుతో అదనపు భారం పై సిపిఎం పోరుబాట …
ఏసీడీ ల పేరుతో అదనపు భారం ప్రజలపై మోపొద్దు
విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా
సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

ఏసీడీ ల పేరుతో విద్యత్ శాఖ ప్రజలపై అదనపు భారం మోపడంపై సిపిఎం జిల్లా శాఖ ఫైర్ అయింది . వెంటనే ఏసీడీ పేరుతో చేస్తున్నా వసువుళ్ళను నిలిపివేయాలని లేని యెడల ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హెచ్చరించారు . శనివారం ఖమ్మంలోని విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ఏ సి డి చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించింది . ఈ ధర్నానిద్దేశించి ఆయన మాట్లాడుతూ పేదలపై ,సామాన్యులపై రాష్ట్ర ప్రభుత్వం దొంగ చాటుగా భారాలను మోపడం సరైన కాదని విమర్శించారు. ప్రభుత్వ నష్టాల్లో ఉన్నదని పేరుతో ప్రజలపై అధిక చార్జీలు వసూలు చేయడం అన్యాయం అన్నారు.బిల్లులు కట్టని వారి మొండిబకాయల వారి ఆస్తులు జప్తు చేసుకోవాలని , కానీ రెగ్యులర్గా బిల్లులు కడుతున్న వారిపై ఇలా బారాలు మెపడం దారుణం అన్నారు. ప్రభుత్వ అధికారులు బిల్లు కలెక్టర్లు నిర్లక్ష్యం మా లేక సిబ్బంది కొత్తవలన ఏమో గాని 30 రోజులు రీడింగ్ తీయాల్సిన బిల్ కలెక్టర్ బిల్లును 40 రోజులకు రీడింగ్ తీయడం తో ప్రజలపై రీడింగ్ పెరిగిపోయి స్లాబ్ రేటు మారిపోయి అదనపు భారాలు పెరుగుతున్నాయన్నారు. ఇది ఒక రకమైన దోపిడీ అని విమర్శించారు .అయినప్పటికీ ప్రజలు కడుతూనే ఉన్నారని, అసలు కట్టని వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిబ్బందిని భర్తీ చేయాలని, ఉన్న సిబ్బందితో వెట్టి చాకిరి చేయిస్తున్నారని ప్రభుత్వ చర్యలపై మండిపడ్డారు ,ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, రెగ్యులర్ పోస్టులు ఇవ్వటం ద్వారా ఈ నష్టం జరగకుండా చూసుకోవచ్చు అన్నారు. ప్రజల పై బారాలు వేస్తె సహించమని అన్నారు .

జిల్లాలోని 75 శాతం ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బిల్లులు , శాసనసభ్యులకు విశాలవంతమైన భవనాలు, క్యాంపు కార్యాలయాలు నిర్మించారని, ఈ భవనాలు నిర్మించిన అప్పటినుండి నుంచి ఇప్పటివరకు విద్యుత్ బిల్లులు చెల్లించిన దాఖల లేవని ఆరోపించారు. పెండింగ్ బిల్లు చెల్లించేందుకు వారు కార్యాలయం విద్యుత్తు నిలిపివేయాలని లేని వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని సామాన్యులపై భారాలు వేయొద్దని డిమాండ్ చేశారు.

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై .విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, తాళ్లపల్లి కృష్ణ, ఎం ఏ జబ్బార్, దొంగల తిరుపతిరావు, యర్రా శ్రీనివాసరావు, నందిపాటి మనోహర్ , జిల్లా నాయకులు ఎస్.కె మీరా సాహెబ్ , బోడ పట్ల సుదర్శన్ ,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ బెయిలు రద్దవుతుందంటూ కథనం.. విచారణ వాయిదా వేసిన సిబిఐ కోర్టు….

Drukpadam

ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు ఈడీ స‌మ‌న్లు!

Drukpadam

అమెరికాలో ఎన్నారైని తుపాకీతో కాల్చి చంపిన టీనేజర్లు

Drukpadam

Leave a Comment