క్రైమ్ వార్తలు

ఈసారి రివర్స్… చైనా గగనతలంలో అమెరికా బెలూన్లు!

ఈసారి రివర్స్… చైనా గగనతలంలో అమెరికా బెలూన్లు!

  • ఇటీవల అమెరికా గగనతలంపై చైనా బెలూన్లు
  • కూల్చివేసిన అమెరికా
  • తమ గగనతలంలో అమెరికా బెలూన్లు చొరబడ్డాయంటున్న చైనా
  • తాము బాధ్యతాయుతంగా వ్యవహరించామన్న డ్రాగన్

ఇప్పటిదాకా చైనా నిఘా బెలూన్లు తమ గగనతలంలో గూఢచర్యం చేస్తున్నాయని అమెరికా తీవ్ర ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. ఇప్పుడు చైనా కూడా అదే తరహాలో ఆరోపణలు చేస్తోంది. తమ గగనతలంలో అమెరికా బెలూన్లు చొరబడ్డాయని చైనా వెల్లడించింది.

అమెరికా బెలూన్లు తమ గగనతలంలోకి రావడం కొంతకాలంగా జరుగుతోందని, గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు 10 పర్యాయాలకు పైగా అమెరికా బెలూన్లు అనుమతి లేకుండా తమ గగనతలంలోకి వచ్చాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు.

Related posts

ప్రొద్దుటూరు 1వ టౌన్ మహిళా ఎస్‌ఐపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

Ram Narayana

ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిపై కేసు న‌మోదు…

Drukpadam

అప్పు తీర్చట్లేదంటూ భర్త ముందే భార్యపై అఘాయిత్యం

Ram Narayana