Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభణ హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలి: సిపిఎం

జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.

కార్పొరేషన్ ఎన్నికలతోనే కరోన వ్యాప్తి.

ఖమ్మంలో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయాలి.

జిల్లాలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు తెలిపారు. సోమవారం ఖమ్మంలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కరోన వేలాదిమంది చనిపోయారని ఇప్పటికైనా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు జిల్లాలో రెమిడీసీవిర్ మందులు సప్లయ, ఆక్సిజన్ సరఫరా చేయాలని అదేవిధంగా జిల్లాలో ఆక్సిజన్ సరిపోయేలా లేకపోతే కొనుగోలు చేసి అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఖమ్మం జిల్లా కేంద్రంలో తాత్కాలికంగా హాస్పిటల్ ఏర్పాటుచేసి యుద్ధ ప్రాతిపదిికన సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు అసలు కార్పొరేషన్ ఎన్నికలతోనే కరోన వ్యాప్తి బాగా పెరిగిిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత అని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఖమ్మంలో మరో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించాలి అన్నారు జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రిలో దోపిడీ ఎక్కువయిందని రూ. 1300, రెమిడీసీవిర్ ఇంజక్షన్ రూ. 30 వేల నుంచి 40 వేలకు అమ్ముతున్నారని దానిని అరికట్టేందుకు జిల్లాలో ఓ ప్రత్యేక అధికారి నియమించి ఫీజుల దోపిడీ కట్టాలన్నారు అంతేకాకుండా కరోన పాజిటివ్ వచ్చిన గర్భిణీ మహిళలకు ప్రత్యేకంగా డెలివరీ ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేయాలని సాధాారణ డెలివరీ వైద్యులు లు ఆపరేషన్లులు చేయడం లేదని గర్భిణీ మహిళలకు ప్రత్యేకంగా ఆపరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు .18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కోరారు అంతేకాకుండా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అదనంగా బెడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు ఆక్సిజన్ కొరత వల్ల ఎంతోమంది చనిపోతున్నారని అలాంటిి జరగకుండా అవసరమైతేే ఖమ్మం కార్పొరేషన్ నిధుల నుండి మందులు ఆక్సిజన్ కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లాలో మారుమూల గ్రామాల్లో సైతం కరోనా మహమ్మారి వ్యాప్తిి చెందిందన దాన్నిని అరికట్టేందు గ్రామస్థాయిలో వైద్య సిబ్బంది నియమించి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కేరళ తమిళనాడు రాష్ట్రాలు మాదిరిగా కరోనాను ఆరోగ్య శ్రీ లు చేర్చాలని డిమాండ్ చేశారు. గ్రామ గ్రామాన మొబైల్ వాహనాల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరారు ప్రభుత్వం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఆధార్ కార్డు ఆధారంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వైఖరి కారణంగానే కరోన వ్యాప్తి జరిగిందని ఆరోపించారు దేశ ప్రధాని నరేంద్ర్ర మోడీ ఎప్పుడు జరిగే కుంభమేళాను జరిపించడం తో కరోన మరింత పెరిగిందన్నారు సైంటిస్ట్ లు ఎంత చెప్పినప్పటికీ వినిపించుకోలేదని దాని పర్యవసానంగా దేశవ్యాప్తంగా పెరిగిందని అన్నారు దేశంలో ఆక్సిజన్ అందక నాలుగు లక్షల మంది చనిపోయారని అధికారులు ఎక్కడ చెబుతున్నప్పటికీ పదిలక్షల పైన ఉంటుందని అన్నారు రోజుకు దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా చనిపోతున్నారని ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు 15 మంది చనిపోతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్రర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Canon EOS M10’s Successor Rumored To Be Known As The M100

Drukpadam

ఖమ్మం జిల్లాకు సీఎం కేసిఆర్ వరాల జల్లు…

Drukpadam

దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయిన ఎఫ్-35 యుద్ధ విమానం… ఆందోళనలో అమెరికా!

Drukpadam

Leave a Comment