Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సిసోడియా అరెస్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందన!

సిసోడియా అరెస్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందన!

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియా అరెస్ట్
  • నేడు కోర్టులో హాజరు
  • మార్చి 4 వరకు రిమాండ్
  • సిసోడియా అరెస్ట్ ను ఖండించిన సీఎం కేసీఆర్

లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. అదానీకి, ప్రధాని మోదీకి మధ్య ఉన్న అనుబంధం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసిన పని అని ఆరోపించారు.

మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు నేడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఐదు రోజుల కస్టడీ విధించింది.

సిసోడియా అనేక మొబైల్ ఫోన్ల ద్వారా లిక్కర్ స్కాం నిందితులతో మాట్లాడారని, సాక్ష్యాలు లేకుండా చేశారని ఇవాళ వాదనల సందర్భంగా సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. లిక్కర్ విధానంలో కమీషన్ ను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచారని, లిక్కర్ విధానంలో చివరి నిమిషంలో మార్పు ద్వారా లైసెన్స్ పొందినవారికి ప్రయోజనం చేకూర్చారని సిసోడియాపై ఆరోపణలు చేశారు.

సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవితపైనా తీవ్ర ఆరోపణలు ఉండడం తెలిపిందే.

Related posts

హైకోర్టు లో ఏపీ సర్కార్కు మరో ఎదురు దెబ్బ…

Drukpadam

ఖేల్ రత్నలో రాజీవ్ కు గ్రహణం …తొలగించిన కేంద్రం స్వయంగా వెల్లడించిన ప్రధాని!

Drukpadam

హోదా వస్తే ఒంగోలు కూడా హైదరాబాద్ అవుతుందని చెప్పిన జగన్ ఇప్పుడెందుకు పోరాడడం లేదు?: చంద్రబాబు!

Drukpadam

Leave a Comment