Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

విజయవాడ రైల్వే ఆసుపత్రిలో రీఫిల్లింగ్ చేస్తుండగా ఆక్సిజన్ లీక్.

విజయవాడ రైల్వే ఆసుపత్రిలో రీఫిల్లింగ్ చేస్తుండగా ఆక్సిజన్ లీక్.. గాల్లో కలిసిన వెయ్యి కిలోలీటర్లు!
  • ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి ట్యాంకర్‌లో ఆక్సిజన్
  • దట్టంగా కమ్ముకున్న పొగతో జనం పరుగులు
  • ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు ఉండడంతో తప్పిన ముప్పు

ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ విజయవాడ రైల్వే ఆసుపత్రిలో వెయ్యి కిలోలీటర్లకు పైగా ఆక్సిజన్ వృథా అయింది. ఆటోనగర్‌లో ఉన్న ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి రైల్వే ఆసుపత్రికి ప్రతి రోజూ వెయ్యి కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. నిన్న కూడా ఓ ట్యాంకర్ ఆక్సిజన్ మోసుకొచ్చింది.

ట్యాంకర్‌లోని ఆక్సిజన్‌ను ఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లీకైంది. దీంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం తెల్లని పొగలా ఆక్సిజన్ దట్టంగా కమ్మేసింది. దీంతో ఏం జరుగుతుందో తెలియని ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆక్సిజన్ లీకైనప్పటికీ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు, కాన్సంట్రేటర్లు ఉండడంతో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఘటనపై డివిజనల్ రైల్వే మేనేజర్ వివిచారణకు ఆదేశించారు.

Related posts

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు….ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం…

Drukpadam

తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా పై తమిళనాడు సీఎం పళని స్వామి అభ్యంతరం

Drukpadam

ముక్కులో నిమ్మరసం పిండుకుంటే కరోనా రాదనుకున్నాడు… కానీ కడతేరిపోయాడు!

Drukpadam

Leave a Comment