రాహుల్ గాంధీకి మరిన్ని ఇబ్బందులు.. బంగ్లా కూడా ఖాళీ చేయాల్సిందే!
- ఎంపీగా అనర్హతకు గురైన రాహుల్ గాంధీ
- కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై 30 రోజుల్లో స్టే తెచ్చుకోవాల్సిన వైనం
- లేని పక్షంలో రాహుల్ కు పెరగనున్న ఇబ్బందులు
మోదీ అనే ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల కేసు తీర్పు పర్యవసానంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆయనపై నమోదైన ఈ పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించడంతో… ఎంపీగా ఆయన డిస్ క్వాలిఫై అయ్యారు.
తమ తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి కోర్టు ఆయనకు 30 రోజుల సమయాన్ని ఇచ్చింది. దీంతో, ఈలోగా ఆయన తనకు విధించిన శిక్షపై హైకోర్టులో స్టే తెచ్చుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో ఆయన ఉంటున్న తుగ్లక్ రోడ్డులోని 12వ నంబర్ బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది. 2004లో లోక్ సభకు ఎన్నికైనప్పటి నుంచి ఆయనకు ఈ బంగ్లాను కేటాయించారు. మరోవైపు, ప్రియాంకాగాంధీకి భద్రతను తగ్గించిన నేపథ్యంలో ఆమె కూడా 2020లో తనకు కేటాయించిన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చింది.