Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి! 

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి! 

  • గాల్లో ఎగురుతుండగా బెలూన్ లో అగ్ని ప్రమాదం
  • ప్రాణ భయంతో కిందికి దూకేసిన ఓ మహిళ, మరో వ్యక్తి
  • ఎత్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి
  • ఓ చిన్నారి సహా మరో ముగ్గురికి గాయాలు

హాట్ ఎయిర్ బెలూన్ లో సరదాగా ఆకాశంలో విహరిద్దామనే కోరిక విషాదంగా మారింది. ఆకాశంలో బెలూన్ కు నిప్పంటుకోవడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో చిన్నారి సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మెక్సికో సిటీలో శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మెక్సికోలోని ప్రముఖ పర్యాటక కేంద్రం టియోటియాకాన్ లో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ కు ప్రసిద్ధి. చుట్టుపక్కల నగరాలతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. శనివారం కొంతమంది పర్యాటకులు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ కు వెళ్లారు. అయితే, గాల్లోకి లేచిన బెలూన్ లో కాసేపటికి మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో బెలూన్ లో ఉన్న వారు భయాందోళనకు లోనయ్యారు.

మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ప్రాణాలు కాపాడుకోవడానికి ఓ మహిళ, మరో వ్యక్తి కిందకు దూకేశారు. చాలా ఎత్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో కాలిపోయిన బెలూన్ నేల కూలింది. దీంతో బెలూన్ లో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మొత్తం కింద ఉన్న వారి ఫోన్లలో రికార్డు అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

Related posts

చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఖలిస్థానీ లీడర్

Drukpadam

రిషికొండపై నిర్మిస్తున్నది సెక్రటేరియట్ కాదు: వైఎస్సార్‌‌సీపీ ట్వీట్

Ram Narayana

నిరుద్యోగుల మోముల్లో చిరునవ్వే నా లక్ష్యం…భారీ జాబ్ మేళాలో పొంగులేటి !

Drukpadam

Leave a Comment