Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

లిక్కర్ …లీకుల చుట్టూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు …

లిక్కర్ …లీకుల చుట్టూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు …
మీరు లిక్కర్ స్కాం దోషులు అంటే …మీరు లీకు వీరులు అంటూ పరస్పర
ఆరోపణలు …
బీఆర్ యస్ ,బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నాయని కాంగ్రెస్ విమర్శ
ప్రజాసమస్యలు గాలికి …పట్టించుకోని పాలకులు
ధరల భారంతో కుంగుతున్న ప్రజలు

 

రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా,ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు లిక్కర్ ,లీకుల చుట్టూ తిరుగుతున్నాయి….బీఆర్ యస్ , బీజేపీ లు ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నారు. దోషులు మీరంటే ,మీరేనని ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయాలు అతలాకుతలం అవుతున్నాయి. మీరు లిక్కర్ దోషులు అంటే మీరు లీకు వీరులంటూ దూషణ భూషణలు చేసుకుంటున్నారు …దీనిపై కాంగ్రెస్ బీజేపీ ,బీఆర్ యస్ లు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నాయని విమర్శలు గుప్పించింది. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి పెరుగుతున్న ధరలను పట్టించుకోకుండా ఉంటున్న పాలకుల వైఖరిని తప్పుపడుతుంది.

కేసులు అరెస్టులు ఈడీ విచారణలు ,సిబిఐ దాడులు , ఇన్ కం టాక్స్ అధికారాల సోదాలతో రాజకీయాల్లో ఉన్న వ్యాపారులను టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ కి ఎస్ ఎస్ సి ప్రశ్న పాత్రల లీకులతో సంబంధాలు ఉన్నాయని కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేయడం తరవాత కోర్ట్ బెయిల్ ఇవ్వడంతో విడుదల కావడం, రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. దీంతో వెనక్కు పోయింది అనుకున్న ఎమ్మెల్యే కవిత లిక్కర్ కేసు సుఖేష్ విడుదల చేస్తున్న వాట్స్ యాప్ చాటింగ్ లు ఫోన్ నెంబర్లు కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇది ఫేక్ తనకేమి సంబంధంలేదు …అసలు సుఖేష్ ఎవరో తాను చూడలేదని అంటున్న కవిత మాటలు ప్రజలు ను ప్రజలను సమాధాన ప్రరచలేక పోతున్నాయి. తాజాగా ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు లిక్కర్ స్కాం తో ఉన్న సంబంధంపై సిబిఐ విచారణకు హాజరు కావాలని సమన్లు జారీచేసింది. ఆదివారం ఆయన సిబిఐ ఎదుట హాజరైయ్యారు . ఆయనకు సిబిఐ 56 ప్రశ్నలు సందించిందని వార్తలు వచ్చాయి . అన్నిటికి ఆయన ఏమి చెప్పాడు ,ఎలాంటి ప్రశ్నలు వేశారు అనేది బయటకు రానప్పటికీ తనదైన శైలిలో సిబిఐ ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చినట్లు వార్త కథనాల సారాంశం … దేశంలో ప్రతిపక్ష పార్టీల పై కక్ష సాధింపులో భాగమే ఈడీ , సిబిఐ దాడులని కేజ్రీవాల్ ఎదురు దాడికి దిగారు . స్థూలంగా పరిశీలిస్తే ఇది నిజమేనని అభిప్రాయం ఆలోచన పరుల్లో కలుగుతుంది. దేశంలో అనేకమంది విపక్ష పార్టీలకు చెందిన నేతలను ఎంపీలు ,ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసికొని జరుగుతున్న ఈదాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు లాంటివే ..దేశంలో ఒక్క బీజేపీ నాయకుడి మీద ఈడీ , సిబిఐ , ఇన్ కం టాక్స్ సోదాలు జరిగినట్లు దాఖలాలు లేవు …అంతకు ముందు ఎవరిపైనైనా ఈడీ , సిబిఐ కేసులు ఉంటె బీజేపీలో చేరితే పవిత్రులు అవుతున్నారనే విపక్షాల విమర్శలకు సమాధానాలు దొరకడంలేదు … ఒక వేళ ఒకటో అరో ఎక్కడన్నా జరిగినా అవి నామమాత్రమేననే అభిప్రాయాలు ఉన్నాయి.

లిక్కర్ స్కాం లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వచ్చాయి. ఆమెకు లిక్కర్ స్కాం తో సంబంధం ఉందని ఈడీ విచారణ …ఆమె తనకు లిక్కర్ స్కాం తో ఎలాంటి సంబంధం లేదని నెత్తి ,నోరు మొత్తుకుంటుంది. ఆయన ఆమెను వదలడం లేదు … ఆమె పేరు ఛార్జ్ షీట్ లో ఉందని అంతకు ముందు అదుపులోకి తీసుకున్న రామచంద్ర పిళ్ళై , సుఖేష్ , చిరంజీవి లు తమ విచారణలో చెప్పారని అంటున్నారు . ఆమె చెప్పినట్లు డబ్బులు కూడా ఆమె చెప్పినచోటుకు చేర్చామని అంటున్నారు .

దానిపై ఢిల్లీలో ఈడీ ఆమెను మూడు సార్లు ప్రశ్నించింది. ఇందులో ఎలాంటి సమాచారం లభించింది. ఆమె పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది బయటకు రాలేదు …అయితే ఆమెను ఢిల్లీకి పిలిచి ఈడీ ప్రశ్నించిన సందర్భంగా హైద్రాబాద్ నుంచి మంత్రివర్గ సహచరులు , ఎంపీలు ఎమ్మెల్యేలు , పెద్ద సంఖ్యలోఢిల్లీకి చేరుకోవడం హడావుడి చేయడం రివాజుగా మారింది . ఇందుకోసం ప్రత్యేక ఫ్లైట్ ను ఏర్పాటు చేసుకున్నారు . ఈడీ ఆఫీస్ ముందు ప్రజలు భారీసంఖ్యలు ఉండటంతో ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించి గుంపులు ,గుంపులుగా ఎవరు ఉండకూడదని అక్కడ చేరిన ప్రజలను పంపించారు . మూడు సార్లు ఇదే తంతు జరిగింది. మొదటి రోజున ఢిల్లీ ప్రజలకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ఈడీ ఆఫీస్ ముందుకు తరలించారని తమను తీసుకోని వచ్చినవారు డబ్బులు ఇవ్వలేదని ఛానళ్ల ముందు వచ్చినవారు తమ గోడు వెళ్ళ బోసుకున్నారు ఈ వార్తలు పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి. సోషల్ మీడియాలో వచ్చిన క్లిప్పింగ్ లు బీఆర్ యస్ కు మైనస్ గా మారాయి.

అయితే ఈడీ కవితను ప్రశ్నించడం పూర్తీ అయిందా లేదా …? అనేది ఇంకా తేలలేదు … సుఖేష్ విడుదల చేస్తున్న వాట్స్ యాప్ మెసేజ్ లు , వాస్తవమా ..? ఫేక్ నా అనేది విచారణలో తేలాల్సిన అంశం …నిజంగా ఈకేసులో కవిత ఉన్నా శిక్ష పడాల్సిందే …అది రాజకీయ కక్ష సాధిపు కాకూడదు … ప్రజాధనాన్ని అక్రమ మార్గాల ద్వారా లూటీ చేసేవారు ఎంతటివారైనా వదల కూడదు … ఏ విచారణ అయినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జరగాలి .ఆలా కాకుండా రాజకీయాల చుట్టూ తిప్పడం దురదృష్టకరం …

 

Related posts

కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం…ఎంపీ నామ నాగేశ్వరరావు!

Drukpadam

మోదీకి దమ్ముంటే యడియూరప్పపై విచారణ జరిపించాలి: సిద్ధరామయ్య!

Drukpadam

దేవినేని ఉమపై గెలిచినందుకు నాకు బలుపే.. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్…

Drukpadam

Leave a Comment