Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పర్యాటకులకు గమనిక.. నేడు, రేపు పాపికొండల విహారయాత్ర రద్దు..!

పర్యాటకులకు గమనిక.. నేడు, రేపు పాపికొండల విహారయాత్ర రద్దు..!

  • ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు
  • అకాల వర్షాలకు తోడు ఈదురు గాలులు కూడా
  • వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్లీ యాత్రకు అనుమతిస్తామన్న అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిన నేపథ్యంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన పాపికొండల విహారయాత్రను అధికారులు రద్దు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలకు తోడు ఈదురు గాలులు కూడా వీస్తుండడంతో పాపికొండల యాత్రను నేడు, రేపు రద్దు చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్లీ యాత్రకు అనుమతించనున్నట్టు పోశమ్మగుడి కంట్రోల్ రూమ్ మేనేజర్ రజిత్ తెలిపారు.

ఉపరితల ద్రోణి కారణంగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒకసారి, సాయంత్రం 6.30 గంటల సమయంలో రెండోసారి కురిసిన వర్షానికి భక్తులు ఇబ్బంది పడ్డారు. తిరుమాడ వీధులు జలమయమయ్యాయి పలు షాపింగ్ కాంప్లెక్స్‌‌లలోకి నీరు ప్రవేశించింది. భక్తులు షెడ్ల కింద తల దాచుకోవాల్సి వచ్చింది.

Related posts

గవర్నర్ తమిళిసైపై మెడికో ప్రీతి సోదరి ఆగ్రహం… స్పందించిన రాజ్ భవన్!

Drukpadam

తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ అప్రమత్తం …

Drukpadam

హిజాబ్ లేకుండా కాలేజీకి వెళ్లం..సంచ‌ల‌న నిర్ణ‌యం!

Drukpadam

Leave a Comment