Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జగన్ ను కలిసేందుకు మహారాష్ట్ర నుంచి 800 కిమీ సైకిల్ తొక్కుతూ వచ్చిన రైతు…

జగన్ ను కలిసేందుకు మహారాష్ట్ర నుంచి 800 కిమీ సైకిల్ తొక్కుతూ వచ్చిన రైతు…

  • ఎల్లలు దాటిన అభిమానం
  • సీఎం జగన్ పై అభిమానం పెంచుకున్న మహారాష్ట్ర రైతు
  • షోలాపూర్ జిల్లా నుంచి సైకిల్ తొక్కుతూ తాడేపల్లి చేరుకున్న వైనం
  • ఆప్యాయంగా స్వాగతించిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ పై అభిమానం రాష్ట్రాల సరిహద్దులు దాటింది. ఓ మహారాష్ట్ర రైతు సీఎం జగన్ పై అభిమానంతో మహారాష్ట్ర నుంచి సైకిల్ తొక్కుతూ వచ్చాడు. ఆ రైతు పేరు కాకా సాహెబ్ లక్ష్మణ్ కాక్డే. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాకు చెందినవాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నా, ఆయన విధానాలు అన్నా లక్ష్మణ్ కాక్డే ఎంతో అభిమానించేవాడు. దాంతో జగన్ ను ఎలాగైనా కలవాలని నిశ్చయించుకున్నాడు.

ఈ నెల 17న మహారాష్ట్రలోని తన స్వస్థలం నుంచి ఓ సైకిల్ పై బయల్దేరాడు. 800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి తాడేపల్లి చేరుకున్నాడు. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి మురిసిపోయాడు.

కాక్డే గురించి తెలుసుకున్న సీఎం జగన్ ఆ రైతును ఆప్యాయంగా ఆహ్వానించారు. అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, రైతు కాక్డే జగన్ బొమ్మ ఉన్న టీషర్టు ధరించాడు. దానిపై కాబోయే ప్రధాని జగన్ అంటూ రాసి ఉంది.

Related posts

ఈ ఐదు రకాల ‘టీ’లతో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం …

Drukpadam

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన‌జీయ‌ర్ స్వామికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు

Drukpadam

మెదక్ కలెక్టర్‌పై కేసులు పెడతాం: ఈటల రాజేందర్ సతీమణి…

Drukpadam

Leave a Comment