Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్ట్ భావన కుమారి అరెస్ట్ అక్రమం…వెంటనే విడుదల చేయాలనీ ఐజేయూ డిమాండ్…

జర్నలిస్ట్ భావన కుమారి అరెస్ట్ అక్రమం…వెంటనే విడుదల చేయాలనీ ఐజేయూ డిమాండ్…
-విలేకరి అరెస్ట్ ను ఖండించిన యూపీ , కేరళ , ఢిల్లీ యూనియన్లు , ప్రెస్ క్లబ్ లు …
-టైమ్స్ నౌ విలేకరిగా పనిచేస్తున్న భావన కుమారి
-వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన మహిళా జర్నలిస్ట్ ను అరెస్ట్ చేస్తారా ..?
-అక్రమ కేసులు పెడతారా ..? అదికూడా మగ పోలీస్ అరెస్ట్ చేయడం ఏమిటి!
-ఇదెక్కడి న్యాయం …చట్టాలు పోలీసులకు వర్తించవా …!

టైమ్స్ నౌ విలేకరిగా పనిచేస్తున్న భావన కుమారి అరెస్ట్ అక్రమమని ఆమెను వెంటనే విడుదల చేయాలనీ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షలు కె .శ్రీనివాస్ రెడ్డి , సెక్రటరీ జనరల్ బల్విందర్ జమ్ములు డిమాండ్ చేశారు . ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లుథియానాలో మొహల్లా క్లినిక్‌ల ప్రారంభోత్సవాన్ని కవర్ చేయడానికి భావన కుమారి లూథియానాకు వెళ్లారు .అక్కడ నుంచి తిరిగి వస్తుండగా టైమ్స్ నౌ జర్నలిస్ట్ భావన కుమారి పై ఎస్సీ ,ఎస్టీ కేసు పేరుతో పోలీసులు శుక్రవారం రాత్రి లూథియానాలో అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు . ఇది రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనని యూనియన్ అభిప్రాయపడుతోంది అన్నారు . ఆమెను వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేశారు . కారు ఆక్సిడెంట్ సాకుగా చూపిస్తూ ఆమె పై అక్రమంగా పెట్టిన ఎస్సీ ,ఎస్టీ కేసును ఎత్తి వేయాలన్నారు . ఇది పత్రిక స్వేచ్చకు విఘాతం కలిగించే చర్యగా అభివర్ణించారు . కారు అక్సిడెంట్ కు కారులో కూర్చున్నవారికి ఎలా సంబంధం ఉంటుందని వారు ప్రశ్నించారు. మహిళా జర్నలిస్ట్ ను మగ పోలీస్ అధికారి అరెస్ట్ చేసి దానినుంచి తప్పించుకోవడానికి వారిపై అక్రమ కేసు పెడతారా అని అన్నారు .

మే 5న లూథియానాలో వృత్తిపరమైన విధుల్లో ఉండగా ‘టైమ్స్ నౌ’ జర్నలిస్ట్ భావన కుమారితో పాటు ఆమె సహోద్యోగి , డ్రైవర్‌ను చట్టవిరుద్ధంగా అరెస్టు చేయడంపై పంజాబ్ ,చండీఘడ్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండించింది.వారిని వెంటనే విడుదల చేయాలనీ కోరింది . భావన కుమారిని అరెస్ట్ చేసిన మగ పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పాలకులు స్పందించకపోతే ప్రత్యేక కార్యాచరణకు పూనుకుంటామని హెచ్చరించింది.

పంజాబ్ అండ్ చండీగఢ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ బల్బీర్ సింగ్ జండూ, చైర్మన్ బల్వీందర్ సింగ్ జమ్ము, వైస్ ప్రెసిడెంట్ జై సింగ్ చిబ్బర్, కోశాధికారి బిందు సింగ్, సెక్రటరీ గగన్‌దీప్ అరోరా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, భావన కుమారి తదితరులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆమెపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల ప్రకటన ప్రకారం, ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా
ఒక కులాన్ని కించపరిచే పదజాలాన్ని ఉపయోగించారని ఆరోపించిన కారణంగా ఎస్సీ ,ఎస్టీ చట్టం ప్రయోగించడాన్ని తప్పు పట్టారు .

ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టినట్లయితే, కారులో కూర్చున్న వ్యక్తిని ఏ చట్టం ప్రకారం బుక్ చేయవచ్చు అనే తీవ్రమైన ప్రశ్న తలెత్తుతుందని అన్నారు . ఇది పత్రికా స్వేచ్ఛపై కఠోరమైన దాడి అని, అరెస్టయిన వారికి తక్షణమే న్యాయం జరిగేలా పంజాబ్ ముఖ్యమంత్రి, గవర్నర్‌ ను కలిసి యూనియన్ ఈ అంశాన్ని లేవనెత్తుతుందని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ ఘటనపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ సుమోటో గా తీసుకోవాలని డిమాండ్ వారు చేశారు.

Related posts

భారత్ ఇంధన అవసరాలు తీర్చేందుకు ఇరాన్ సంసిద్ధత

Drukpadam

103 ఎకరాల్లో ఏపీ అసెంబ్లీ నిర్మాణం: మంత్రి నారాయణ

Ram Narayana

ఓటుకు నోటు కేసు: తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు…

Drukpadam

Leave a Comment