Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి కాంగ్రెస్ లో చేరకుండా అడ్డుకట్టలు పడుతున్నాయా …?

పొంగులేటి కాంగ్రెస్ లో చేరకుండా అడ్డుకట్టలు పడుతున్నాయా …?
-బీజేపీలోకి లేదా సొంతపార్టీ పెట్టాలనే వత్తిడి ఉందనే ప్రచారంలో నిజమెంత …!
-ఎవరి ప్రయోజనం కోసం ఆయనపై వత్తిడి పెరుగుతుంది
-కర్ణాటక ఎన్నికల ఫలితాలకు పొంగులేటి రాజకీయాలకు లింకు
-తన రాజకీయ నిర్ణయానికి కర్ణాటక ఎన్నికలతో సంబంధం లేదంటున్న పొంగులేటి…

కర్ణాటక ఎన్నికల తర్వాత బీఆర్ యస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు లతోపాటు మరికొందరు కాంగ్రెస్ లో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది . కొందరు వారు కాంగ్రెస్ పార్టీలోకి పొతే తమకు తీవ్ర నష్టం అనే ఉద్దేశంతో బీజేపీలోకి లేదా సొంతపార్టీ పెట్టేలా ప్రేరేపిస్తున్నారని అందుకు వారికీ ఉన్న అన్ని సంబంధాలను అస్త్రాలుగా ఉపయోగిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ లో చేరకుండా అడ్డుకట్టలు వేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి . దీనికి సూత్రదారులు ఎవరు …? ఎందుకు చేస్తున్నారని అంటే ఇందులో ఎవరి ప్రయోజనాలు వారికున్నాయని అంటున్నారు . అయితే వారి రాజకీయ నిర్ణయాలపై అవి ప్రభావం చూపుతాయా…? లేదా అనేది చూడాల్సి ఉందని అంటున్నారు పరిశీలకులు …

రాష్ట్ర రాజధానిలో కూడా పొంగులేటి , జూపెల్లి ల అడుగులు పై అటు ఇంటలిజెన్స్ , ఇటు రాజకీయ పార్టీలు ఆరా తీస్తున్నాయి. వారు కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణాలో కూడా బీఆర్ యస్ ను ఓడించాకలిగే పార్టీ కాంగ్రెస్ అని నిర్దారణకు వచ్చారా ..లేక ఇంకా అనుమానాలు ఉన్నాయా …? అనేదానిపై వారు ఎటు తేల్చడంలేదు . కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు వ్యూహరచన చేస్తుంది. అందులో భాగంగానే రాహుల్ టీం పొంగులేటి ,జూపల్లిలతో చర్చలు జరిపింది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ వీరిద్దరితోపాటు మరికొందరు చేరే అవకాశాలను పరిశీలిస్తుంది. దాదాపు వారు కాంగ్రెస్ లో చేరుతున్నారని బీఆర్ యస్ వర్గాలు కూడా నిర్దారణకు వచ్చాయి. కానీ వారిని కాంగ్రెస్ లో చేరకుండా కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయని విశ్వసనీయ సమాచారం ..వాళ్ళు ఎవరు …? ఎవరి ప్రయోజనాలకోసం అడ్డుపడుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది .

కానీ ఆ ఇద్దరు నేతలు ఎందుకో మరికొంతకాలం వేచిచూసే ధోరణిలో ఉన్నారని తెలుస్తుంది. అయితే వారిపై వివిధ పార్టీల నుంచి తమ పార్టీలో చేరాలని వత్తిడి ఉంది . కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు పెద్ద ప్రయత్నాలే చేస్తున్నాయి. చివరకు టీడీపీ తెలంగాణ నేతలు కూడా కలిశారు . షర్మిల పార్టీ ఇంకా ఆశగా ఉంది. అయితే బీఆర్ యస్ ను ఓడించగలిగే పార్టీలోకి వెళ్లాలని పొంగులేటి నిర్ణయించుకున్నారు . ఎక్కడ రాజకీయాలు ఎలా ఉన్న తెలంగాణ లో మాత్రం తమకు కనీస గౌరవం ఇవ్వకుండా అవమానపరిచిన కేసీఆర్ పై కక్ష్య తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు . అలాంటప్పుడు ఎవరి ప్రభావాలకో పడిపోయే అవకాశమే లేదని పొంగులేటి అనుయాయులు కొట్టిపారేస్తున్నారు .తమది సింగిల్ ఎజెండా కేసీఆర్ ను ఇంటికి పంపడం …అందుకోసం తమ కార్యాచరణ ఉంటుందని అంటున్నారు . రానున్న రోజుల్లో పెద్ద మార్పు ఖాయమని అప్పటివరకు వేచి చూడాలని అంటున్నారు .ఇప్పటికే బీఆర్ యస్ లో అవమానాలకు గురైన వారు అసమ్మతి నేతలు పొంగులేటి ,జూపల్లిలతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం …

కుమారస్వామిని కేసీఆర్ మోసం చేశారని పొంగులేటి ధ్వజం …

కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ నేత కుమారస్వామి ని కేసీఆర్ మోసం చేశారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు . ఆదివారం వనపర్తి లో జూపల్లి కృష్ణారావు ఆధ్వరంలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు . ఈ సందర్భంగా తమ రాజకీయ అడుగులపై ఇంకా ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు . కర్ణాటక ఎన్నికలకు తమ రాజకీయ అడుగులకు ఏలాంటి సంబంధం లేదన్నారు . కేసీఆర్ ను ఇంటికి పంపించగలిగేవారితోనే తమ ప్రయాణం ఉంటుందని ఉద్ఘాటించారు .

Related posts

జబ్బార్ స్టేట్మెంట్లో లాజిక్ మిస్…

Drukpadam

ఒవైసీల మెప్పు పొందడానికి కేసీఆర్ యత్నిస్తున్నారు: మాజీ సీఎం రమణ్ సింగ్!

Drukpadam

అచ్చెన్నాయుడు హౌస్ అరెస్ట్.. ఇంటి చుట్టూ పోలీసులు!

Drukpadam

Leave a Comment