Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రధాని అత్తగారినని చెప్పాను… కిందికి పైకి చూశారు: సుధామూర్తి

ప్రధాని అత్తగారినని చెప్పాను… కిందికి పైకి చూశారు: సుధామూర్తి

  • ఇటీవల బ్రిటన్ వెళ్లిన సుధామూర్తి
  • ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులతో తంటా
  • చిరునామా ఇవ్వాలని కోరిన అధికారులు
  • తన అల్లుడు రిషి సునాక్ అడ్రస్ ఇచ్చిన సుధామూర్తి
  • జోక్ చేస్తున్నారా అని అడిగిన అధికారులు

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అర్ధాంగి సుధామూర్తికి ఇటీవల బ్రిటన్ పర్యటనలో విచిత్రమైన అనుభవం ఎదురైంది. తాను బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్తగారిని అని చెబితే అక్కడి అధికారులు అదొక జోక్ కింద కొట్టిపడేశారట.

ఈ మధ్య తాను బ్రిటన్ వెళ్లానని, అయితే ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు చిరునామా అడిగారని సుధామూర్తి వెల్లడించారు. బ్రిటన్ లోనే ఉంటే తన కుమారుడి అడ్రస్ సరిగా తెలియదని, దాంతో తన కుమార్తె భర్త అయిన బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ అడ్రస్ (నెం.10, డౌనింగ్ స్ట్రీట్, లండన్) ఇచ్చానని తెలిపారు. దాంతో, ఆ ఇమ్మిగ్రేషన్ అధికారులు తనవైపు నమ్మలేనట్టుగా చూశారని ఆమె వివరించారు.

“నేను ప్రధాని రిషి సునాక్ అత్తగారినే అని చెబుతుంటే, జోక్ చేస్తున్నారా? అనడిగారు. నేను నిజమే చెబుతున్నాను అని వారికి స్పష్టం చేశాను. అప్పటికీ వారి ముఖాల్లో సందేహాలు పోలేదు. నా వస్త్రధారణ వల్లే వారికి నేను ప్రధాని అత్తగారిలా కనిపించలేదేమో” అని సుధామూర్తి పేర్కొన్నారు.

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షత మూర్తి, రిషి సునాక్ ప్రేమించి, ఆపై పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Related posts

తానా ద్వారా తెలుగు రాష్ట్రాలకు కాన్సంట్రేటర్లు,వెంటిలెటర్సు

Drukpadam

ప్రీతిని వేధిస్తున్నారని తెలిసినా హెచ్ఓడీ పట్టించుకోలేదు: ఈటల రాజేందర్!

Drukpadam

Drukpadam

Leave a Comment