Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

సింగపూర్ లో కొత్త కరోనా వేరియంట్.. అక్కడి నుంచి వచ్చే అన్ని విమానాలను ఆపేయండి: కేజ్రీవాల్

సింగపూర్ లో కొత్త కరోనా వేరియంట్.. అక్కడి నుంచి వచ్చే అన్ని విమానాలను ఆపేయండి: కేజ్రీవాల్
  • సింగపూర్ కరోనా వేరియంట్ మన దేశానికి ప్రమాదకరం
  • థర్డ్ వేవ్ కు దారితీసే అవకాశం ఉంది
  • చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది
సింగపూర్ లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ మన దేశానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఆ వేరియంట్ మన దేశంలో థర్డ్ వేవ్ కు దారితీసే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో సింగపూర్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

సింగపూర్ నుంచి వచ్చే కరోనా వేరియంట్ చిన్న పిల్లలకు చాలా హాని కలిగిస్తుందని కేజ్రీ అన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే సింగపూర్ నుంచి విమానాలను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. చిన్న పిల్లలకు కూడా వెంటనే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరారు.

Related posts

దేశంలో బ్లాక్ ఫంగస్ కలకలం…..

Drukpadam

దేశంలో కరొనపై సోనూసూద్ ఆశక్తికర వ్యాఖ్యలు

Drukpadam

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా…

Drukpadam

Leave a Comment