Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి జిల్లాలో దూకుడు పెంచిన పువ్వాడ …గెలుపు భాద్యత ఆయనదే …!

ఉమ్మడి జిల్లాలో దూకుడు పెంచిన పువ్వాడ …గెలుపు భాద్యత ఆయనదే …!
-పదునైన మాటలతో ప్రతిపక్షాలపై దాడి
-బహిష్కృత నేత పొంగులేటి పై తూటాల వర్షం
-కేసీఆర్ పై విమర్శలు చేస్తే సహించమని హెచ్చరిక
-తనపై విమర్శలను తిప్పికొట్టిన మంత్రి
-ఉమ్మడి జిల్లాలో 10 కి 10 గెలుపే లక్ష్యంగా వ్యూహాలు

 

జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దూకుడు పెంచారు .వివిధ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు .అభివృద్ధి కార్యక్రమాలతోపాటు , పార్టీ ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొంటున్నారు . గతంలో కన్నా ఆయనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.ఎన్నికలు కొద్దీ నెలలే ఉండటం ఉమ్మడి జిల్లాకు తానే భాద్యుడుగా వహించాల్సి రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 కి 10 సీట్లు గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు .గతంలో జరిగిన తప్పిదాలు జరగకూడదని కేసీఆర్ ఎవరికీ సీటు ఇస్తే వారిని అసెంబ్లీకు పంపడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు . ఖమ్మంలో బీఆర్ యస్ సభ పెట్టకముందు కంటే ఇప్పుడు ఆయనలో ఎక్కువ కసి పట్టుదల కనిపిస్తుంది. ప్రధానంగా మాజీ ఎంపీ పొంగులేటిని పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత తన పదునైన మాటలతో ప్రతిపక్షాలను ప్రత్యేకంగా పొంగులేటి టార్గెట్ గా మాటలు తూటాలు పేల్చుతున్నారు . పార్టీలో ఉండగా కేసీఆర్ ,కేటీఆర్ ను అడ్డం పెట్టుకొని ఆయన వేల కోట్ల సంపాదించారని ఆరోపణలు గుప్పిస్తున్నారు .ఆయన బీఆర్ యస్ పార్టీలోకి రాకముందు వచ్చిన తర్వాత తన అడిట్ రిపోర్టులు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు . ఎన్ ఎస్ పి ఆధునీకరణ పనుల పేరుతో కాలువలకు సిమెంట్ ఫిచుకారి చేసి బిల్లు ఎత్తుకున్న విషయంపై తన సోదరుడు ఫిర్యాదు చేసిన విషయాన్నీ ప్రస్తావిస్తున్నారు .దీనిపై ఇంకా అయిపోలేదని విచారణ పెండింగ్ లో ఉందని వెంటపడ్డాం బిడ్డా నీ అంతు చూస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు . కేసీఆర్ పై విమర్శలు చేస్తే తరిమి కొడతామని అంటున్నారు . తనను నియంత అని విమర్శలు చేయడంపై ఫైర్ అయ్యారు .పొంగులేటి ఆయన వెంట ఉన్న అనుయాయుల సంగతి ముందు ఉంది కాసుకోమంటున్నారు . కోరం కనకయ్య కు పార్టీలో ఇల్లందు సీటు ఇస్తే గెలవలేక ఓడిపోతే మూడు నెలలు తిరగక ముందే జడ్పీటీసీ సీటు ఇచ్చి గెలిపించి జడ్పీ చైర్మన్ చేసి క్యాబినెట్ హోదా కలిపిస్తే పొంగులేటి సంచులు చూసి అటువైపు పోలేదా …? ఇది నిజం కదా ? అని ఇల్లందు సభలో చురకలు అంటించారు .

ఇక జిల్లాలో బీఆర్ యస్ బలం పెరిగిందని ఎవరు వచ్చినా…? ఎవరు ఏ పార్టీలోకి వెళ్లిన బీఆర్ యస్ కు వచ్చే ఇబ్బంది ఏమిలేదని అంటున్నారు . ప్రజాప్రతినిధులం అందరం కలిసి కేసీఆర్ సూచనల మేరకు జిల్లాలో గులాబీ జెండాను రెపరెపలాడిస్తామని విశ్వాసంతో ఉన్నారు .

ఖమ్మం నియోజకవర్గంలో ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ సాదించడంద్వారా రాష్ట్రంలో కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేలా జిల్లా నుంచి ఆయనకు అండగా నిలవాల్సి ఉందని అంటున్నారు . రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుపుతున్న దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేసేందుకు అధికారులను ,ప్రజాప్రనిధులను అప్రమత్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తులు ఉంటాయా…? ఉంటె ఖమ్మం జిల్లాలో వారికీ ఇచ్చే సీట్లు విషయాలపై మంత్రి ఎలాంటి కామెంట్ చేయడంలేదు .పొత్తుల విషయం కేసీఆర్ చూసుకుంటారని , ఆయన చెప్పిన విధంగా నడుచుకొని జిల్లాలో బీఆర్ యస్ కు తిరుగులేదని చాటిచెప్పే విధంగా ప్రణాళికలు రూపాందించడమే తమ కర్తవ్యం అనే అభిప్రాయంతో మంత్రి పువ్వాడ ఉన్నారు .

Related posts

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సెమీస్ చేరే జ‌ట్లివే..!

Ram Narayana

అగ్నిపథ్ పై మావాదనలు వినండి …సుప్రీం కు కేంద్రం వినతి …

Drukpadam

This Dewy, Natural Makeup Routine Takes Less Than 5 Minutes

Drukpadam

Leave a Comment