Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు…మంత్రి పువ్వాడ అజయ్

సమాన ప్రాధాన్యత.. సమగ్రాభివృద్ధిని సాధిస్తూ ముందుకు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరన సభలో మంత్రి అజయ్ కుమార్

రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, గ్రామీణ , పట్టణ, నగర ప్రాoతాలకు సమాన ప్రాధాన్యత.. సమగ్రాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించి ప్రసంగించారు. రహదారులు, భవనముల శాఖ ఖమ్మం డివిజన్ పరిధిలో రూ.2,275 కోట్లతో 368 పనులు మంజూరు కాగా రూ. 1079.53 కోట్లతో 260 పనుల పూర్తి అయ్యాయని , రూ.780.66 కోట్లతో 70 పనులు పురోగతిలో ఉన్నాయని, రూ.390.57 కోట్లతో 31 పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. రూ.180 కోట్లతో ఖమ్మం నగరం ముఖ ద్వారము లో ఉన్న మున్నేరు నదిపై తీగల వంతెన నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి లభించిందని , త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. 100 ఎంబిబిఎస్ సీట్ల సామర్ధ్యం గల ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తగిన విధంగా నవీకరించుటకు రూ.166 కోట్ల మంజూరయ్యాయని పనులు చివరిదశలో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టిందని , శారీరక, మానసిక ధృడత్వానికి, ఆరోగ్య తెలంగాణాకు క్రీడల ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించిందని రూ.93 లక్షలతో సర్దార్. పటేల్ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో (3) లాన్ సింథటిక్ టెన్నిస్ కోర్టులను పూర్తి చేసుకొని క్రీడాకారులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కల్లూరులో 3.40 కోట్లతో రికార్డుస్తాయిలో 10 నెలల్లోనే ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంబించుకున్నామన్నారు. జిల్లాను సస్యశామలం చేసే సీతారామ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఈ ఏడాది లోపే ప్రాజెక్టు పనులు పూర్తి చేసి కరవు పీడిత ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడంతో పాటు ఎన్ ఎస్ పి లో నీటి లభ్యత ఉండని సమయాల్లో ఆయకట్టు స్థిరీకరించడం కోసం పాలేరు రిజర్వాయర్ కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. సభలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, కమీషనర్ అఫ్ పోలీస్ విష్ణు ఎస్ వారియర్, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, పాలేర్ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్, నగర్ మేయర్ నీరజ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, అదనపు కలెక్టర్ లు స్నేహలత , మధుసూదన్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ సురభి, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ లు రాధికా గుప్తా, మయాంక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు స్థానిక వి.డి.ఓస్.కాలనీ లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి జెండా ఎగురవేశారు. బైపాస్ రోడ్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి నివాులర్పించారు. మయూరి సెంటర్ లోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు అంజలి ఘటించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం ఐడిఓసి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఆదేశించి ప్రసంగించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదయాలపై విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శన గావించిన విద్యార్థిని, విద్యార్థులకు మేమెంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. అంతకుముందు కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో అమరవీరుల స్తూపానికి రేగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలలో కొత్తగూడెం, ఇల్లందు శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పి డా వినీత్, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతా లక్ష్మి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

భూకంపాల ముప్పు ఏ ప్రాంతాలకు ఎక్కువ? తెలంగాణ, ఏపీ పరిస్థితి ఏంటి?

Drukpadam

షర్మిల పాదయాత్రకు కోర్ట్ గ్రీన్ సిగ్నల్ …వ్యక్తిగత దూషణలకు నో …

Drukpadam

This couple Quit Their Jobs To Travel The World In A Customized Bus

Drukpadam

Leave a Comment